Minister Balineni: సెబ్ సెగతో ఉక్కిరిబిక్కిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మంత్రికి సెబ్ సెగ గట్టిగానే తాకిందా? సెబ్ అధికారులు మంత్రిని పట్టించుకోవడం లేదా? అమాత్యులవారు చెప్పినా వినకుండా.. ఆయన అనుచరుడినే లోపల వేసేశారా? అందుకే ఆయన నిప్పులు చెరిగారా? ఎవరా మంత్రి? ఏమా కథ?
సమీక్షా సమావేశంలో ‘సెబ్’ అధికారులపై మంత్రి ఫైర్
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లాల్లో ఆయన చెప్పిందే వేదం.. శాసనం. అలాంటి మంత్రిని కూడా పట్టించుకోవడం లేదట ఓ ప్రభుత్వ విభాగం. అదే.. ఎక్సైజ్ శాఖ పరిధిలో పనిచేసే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో.. సెబ్. ఒంగోలు అభివృద్ధిపై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి బాలినేని. ఆ మీటింగ్‌కు సెబ్ అధికారులు కూడా వచ్చారు. ఆ విభాగం వంతు వచ్చేసరికి మంత్రి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారట. దాంతో మంత్రి ఎందుకు ఆ స్థాయిలో కోప్పడ్డారు అనేదానిపై ఒక్కటే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
మంత్రి ముఖ్య అనుచరుడిపైనే ‘సెబ్’ కేసు..!
అక్రమ మద్యాన్ని అరికట్టడంతోపాటు అక్రమ ఇసుక తరలింపునూ అడ్డుకునే అధికారం సెబ్‌కు అప్పగించారు. ఆ మధ్య కొత్తపట్నం మండల పరిధిలో ఇళ్ల నిర్మాణానికి ఇసుక తెచ్చుకుంటున్న రైతుపై కేసు పెట్టారట. గ్రామస్థులు రోజంతా ఆందోళన చేయడంతో సెబ్ అధికారులకు అప్పుడే వార్నింగ్ ఇచ్చారట మంత్రి బాలినేని. అలాగే జిల్లాలో ఎక్కువ అక్రమ మద్యం కేసులు నమోదవుతున్నాయని ఒక సందర్భంలో సీఎం జగన్ మంత్రితో అన్నారట. ఇదే సమయంలో కొత్తపట్నం మండలం మడనూరుకు చెందిన మంత్రి ముఖ్య అనుచరుడిపైనే సెబ్ అధికారులు కేసు నమోదు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. అది బాలినేనికి మరింత ఆగ్రహం కలిగించినట్టు సమాచారం. వాస్తవానికి గ్రామంలో ఎవరి వాహనాలనైనా సెబ్ అడ్డగిస్తే మంత్రి బాలినేనితో మాట్లాడి విడిపించే బాధ్యత ఆ అనుచరుడిదేనట. అలాంటి వ్యక్తిపైనే కేసు పెట్టడంతో సంచలనంగా మారింది.
మంత్రి బాలినేని ఫోన్ చేసినా స్పందించని ‘సెబ్’ అధికారులు?
ఆ కేసు విషయంలో సెబ్ అధికారులను మాత్రమే పిలిచి ప్రశ్నిస్తే లేనిపోని రచ్చ అవుతుందని అనుకున్నారో ఏమో.. ఒంగోలు సమీక్ష పేరుతో అన్ని ప్రభుత్వ విభాగాలను మంత్రి సమావేశానికి పిలిచినట్టు టాక్. ఆ సమీక్షలో సెబ్ వంతు రాగానే బాలినేని బరస్ట్ అయ్యారని అనుకుంటున్నారు. మంత్రి ముఖ్య అనుచరుడిపై కేసు నమోదు చేసిన సమయంలో గ్రామస్థులంతా ఏకమై సెబ్ సీఐ లతతోపాటు పలువురు అధికారులను రౌండప్ చేశారట. ఉదయం నుంచి సాయంత్ర వరకు సమస్య తేలకపోవడంతో వాహనాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారట సెబ్ అధికారులు. ఆ ఘటనపై సీఐ లత ఫిర్యాదు చేయడంతో కేసు కట్టేశారట. ఆ ఘటనపై మంత్రి బాలినేని ఫోన్ చేసినా సెబ్ అధికారులు స్పందించలేదట. ముఖ్య అనుచరుడిపైనే కేసు నమోదు చేసి అమాత్యుల వారికి షాక్ ఇచ్చారు సెబ్ అధికారులు.
మంత్రిని ‘సెబ్’ అధికారులు లైట్ తీసుకున్నారా?
ఆ కేసుతో లోకల్ అధికారపార్టీ నేతల రగిలిపోతున్నారట. మంత్రి బాలినేని మాట్లాడినా కేసు నమోదైతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అధికారపార్టీకి చెందిన తమ వాహనాలపైనే కేసు పెడితే.. గ్రామాల్లో తలెత్తుకుని ఎలా తిరుగుతామని నిలదీసినట్టు తెలుస్తోంది. ఆ ఎఫెక్ట్ వల్లే మీటింగ్‌లో సెబ్ అధికారులపై మంత్రి బాలినేని నిప్పులు చెరిగారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎపిసోడ్లో అధికారులు మంత్రిని లైట్ తీసుకోవడం.. ఆయన మంత్రి అయితే మాకేంటని వ్యవహరించడం చర్చగా మారింది. మంత్రి చెప్పినా వినకపోవడం.. ఆయన ఫోన్ చేసినా స్పందించకపోవడం సెగలు రేపుతున్నట్టు సమాచారం. మరి.. ఈ ఎపిసోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో.. మంత్రిగారి ఆగ్రహం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..