టాలీవుడ్ లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఆయన తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ సినిమా యూత్ పరంగా బాగా అలరించాయి. కానీ ఇందులో ‘పెళ్లిచూపులు’ కు వచ్చిన గుర్తింపు చాలా పెద్దది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. అలాగే తన స్థాయిని మించి ఎదిగిన విజయ్ దేవరకొండను మరోసారి తన సినిమాకు ఒప్పించడం మాత్రం తరుణ్‌కి ఇప్పటిదాకా సాధ్యపడలేదు. ఇక తరుణ్ దర్శకుడిగా మాత్రమే కాదు పలు చిత్రాల్లో మంచి పాత్రలు కూడా పోషించాడు. యాక్టింగ్ పరంగా కూడా ప్రశంసలు అందుకున్నాడు.
Also Read : Peddi : స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు..!
అంతేకాదు తరుణ్ భాస్కర్ తల్లి సైతం పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక పోతే తరుణ్ భాస్కర్ తండ్రి ఉదయ్ భాస్కర్ చాలా సంవత్సరాల క్రితమే మృతి చెందారట. అయితే సొంతిల్లు కట్టుకోవాలనేది ఆయన కల. కాగా తన తండ్రి కలను నెరవేర్చానని చెబుతూ, తాజాగా తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా వేదికగా ఇంటి ఫోటోలు చేశారు.. ‘ మీ కల నెరవేర్చాను నాన్న. నువ్వు చూస్తున్నావనే అనుకుంటున్నా’ అంటూ తరుణ్ భాస్కర్ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇక ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా ఈ మూవీలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.