ఏపీలో పదవతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాల పై వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ట్విట్టర్ లో లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ‘నారాయణ’ ప్రశ్న పత్రాలను లీక్ చేయడమే కారణం పప్పు నాయుడూ. పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం మీదే. దిగజారి…
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. నలుగురు వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారు. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ చేతుల మీదుగా డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య, బీద మస్తాన్ రావు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ… రాజ్యాధికారంలో బీసీలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బీసీలకు మాటలు కాకుండా చేతల్లో అభివృద్ధి చూపిస్తున్నారు.సీఎం జగన్ దేశానికి…
ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక పూర్తయింది. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైసీపీ ముందునుంచీ బలహీనవర్గాలకు పెద్ద పీట వేస్తుందని జగన్ నిరూపిస్తున్నారు. బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. నాలుగింట సగం స్థానాలు బలహీన వర్గాలకే ఇచ్చారు.…
రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోందని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని జగన్ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూస్తున్నారు.కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రం కొలేటరల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.సీఎం జగనుది మోసకారి సంక్షేమం అని ప్రజలే భావిస్తున్నారు. రాష్ట్రం 7.76 లక్షల కోట్ల అప్పుల సుడిగుండంలో చిక్కుకుంది.సీఎం జగన్ దుర్వినియోగం చేసిన రుణాలను ఎవరు తిరిగి చెల్లిస్తారన్నదే ఇపుడు ప్రశ్న?కార్పొరేషన్లు గానీ,…
అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అక్కడ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష చేయబోతున్నారా? పార్టీ.. ప్రభుత్వం లైన్ దాటి రాజకీయాలు చేస్తున్న వారి లెక్కలు తేల్చేస్తారా? ఈ బాధ్యతను పార్టీలో కీలక నేతకు అప్పగించడంతో శాసనసభ్యులు అలెర్ట్ అయ్యారా? ఎక్కడో.. ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. అంతర్గతంగా నాయకత్వం మధ్య అనైక్యత పెరుగుతోందా?ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. ఇక్కడ సమీకరణాలు.. సీట్లు.. ఓట్లు అధికార-విపక్షాలకు అత్యంత కీలకం. ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో టీడీపీదే హవా.…