YS Jagan: జగన్ 2.0లో మహిళలకు, కార్యకర్తలకు పెద్దపీట.. నేతలతో జగన్ భేటీ..!
- అద్దంకి నియోజకవర్గ నేతలతో జగన్ కీలక సమావేశం
- ప్రజా సమస్యలు, రాజకీయ పరిస్థితులపై సమగ్ర చర్చ
- అద్దంకి గెలవలేని స్థలం కాదని జగన్ స్పష్టం
- మహిళా రిజర్వేషన్ చట్టానికి వైసీపీ మద్దతు
- 2029 నుంచి అమలు మంచిదని అభిప్రాయం
- “జగన్ 2.0”లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాట్లాడిన జగన్, అద్దంకి నియోజకవర్గం గెలవలేని స్థలం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై, అలాగే స్థానిక మంత్రిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితులను పార్టీకి అనుకూలంగా మలచుకుని ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు.
Chicken Shops Closed: మాంస ప్రియులకు బిగ్ షాక్.. చికెన్ షాపులు బంద్.. ఎప్పటినంచంటే..
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో వైసీపీ పథకాలను అమలు చేస్తానని చెప్పిన ఆయన, ఆ తరువాత “సూపర్ సిక్స్, సూపర్ సెవెన్” పేరుతో కొత్త హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం అవి అమలులో కనిపించకపోవడం, మేనిఫెస్టోను పూర్తిగా విస్మరించడమేనని జగన్ ఆరోపించారు. ఇక రాష్ట్రంలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనను జగన్ శుభవార్తగా అభివర్ణించారు. మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా ఇది సహకరిస్తుందని తెలిపారు. తమ పాలనలో మహిళలకు పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పించామని గుర్తుచేశారు.
Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. కీలక ఆఫీసుల్ని ఖాళీ చేయాలని కేంద్రం అల్టిమేటం..
ఇంకా మహిళల రిజర్వేషన్ చట్టంపై కూడా జగన్ స్పందించారు. 2023లో వచ్చిన మార్పులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చిందని అన్నారు. 2029 నుంచి ఈ చట్టం అమలులోకి రావడం మంచి నిర్ణయమని ట్వీట్ ద్వారా తెలిపారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనుల్లో కూడా మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. అసెంబ్లీ, లోక్‌సభలో 33% మహిళా ప్రాతినిధ్యం పెరగడం స్వాగతించదగ్గ విషయమని పేర్కొన్నారు. సీట్ల సంఖ్య పెరగడం వల్ల పార్టీ కార్యకర్తలకు నాయకులుగా ఎదగడానికి అవకాశాలు పెరుగుతాయని జగన్ అభిప్రాయపడ్డారు. కష్టపడి పని చేసే వారికి పార్టీ పెద్దపీట వేస్తుందని, “జగన్ 2.0”లో కార్యకర్తలకే ప్రధాన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్పై సౌతాఫ్రికా విజయం.!