Chicken Shops Closed: మాంస ప్రియులకు బిగ్ షాక్.. చికెన్ షాపులు బంద్.. ఎప్పటినంచంటే..
- ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్..
- పిలుపునిచ్చిన రాష్ట్ర చికెన్ షాపుల యజమానుల సంఘం..
- ధర్నాలు చేపడతామని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని మాంసం ప్రియులకు షాక్ ఇచ్చేలా రాష్ట్ర చికెన్ షాపుల యజమానుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీల తీరుకు నిరసనగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ విక్రయాలను నిలిపివేస్తూ బంద్ పాటించాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ వ్యాపారులు పౌల్ట్రీ కంపెనీల విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమకు ఇచ్చే కమీషన్ (మార్జిన్) విషయంలో కంపెనీలు అనుసరిస్తున్న తీరు వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ‘తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్’ ఆరోపిస్తోంది. గతంలో ఇచ్చే కమీషన్ కంటే ప్రస్తుతం కిలోకు రూ. 20 వరకు తగ్గించడం తమకు పెను భారంగా మారిందని వారు పేర్కొంటున్నారు.
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ. 360 నుంచి రూ. 370 వరకు పలుకుతోంది. సాధారణంగా ధరలు పెరిగినప్పుడు వ్యాపారులకు వచ్చే లాభం కూడా పెరగాలి.. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవైపు వినియోగదారులపై భారం పెరుగుతున్నా, మరోవైపు కంపెనీలు తమ మార్జిన్‌ను తగ్గించడంతో షాపుల నిర్వహణ కష్టతరమవుతోందని విక్రయదారులు వాపోతున్నారు. వేసవి కాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, ఆ భారాన్ని అంతా తమపైనే వేస్తున్నారని వారు మండిపడుతున్నారు.
Also Read:Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్‌కు స్పెషల్ ట్రీట్!
ఈ సమస్యపై ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఏప్రిల్ 1 నుంచి దుకాణాలు మూసివేయడమే కాకుండా, పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. మార్జిన్ పెంచే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. చికెన్ షాపులు నిరవధికంగా బంద్ అయితే సామాన్య ప్రజలకు మాంసం దొరకడం కష్టమవుతుంది. ఇది పరోక్షంగా ఇతర మాంసాహార ఉత్పత్తుల ధరలు పెరగడానికి దారితీయవచ్చు. ప్రభుత్వం , పౌల్ట్రీ కంపెనీలు వెంటనే స్పందించి ఈ గొడవను పరిష్కరించాలని సామాన్యులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!