New Districts In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు కొత్తగా ఏర్పడనున్నాయి. ఇందులో రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని, సేవల వేగవంతమైన అందుబాటు కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. IP68+IP69 డ్యూయల్ ప్రొటెక్షన్,…
ఘోర పరాజయం నుంచి కోలుకున్న వైసీపీ... క్రమంగా యాక్టివిటీ పెంచుతోంది. రాజకీయ పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ... నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లను మారుస్తూ... కేడర్‌ని రీ ఛార్జ్ మోడ్‌లోకి తీసుకువస్తోంది. అయితే... ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం పూర్తిగా మ్యూట్ మోడ్‌లో ఉండటం ఏంటో అర్ధంగాక దిక్కులు చూస్తున్నారట కార్యకర్తలు. అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకలాపాలు దాదాపుదా నిలిచిపోయినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
బాపట్ల జిల్లా.... అద్దంకి నియోజకవర్గం అంటేనే వర్గ రాజకీయాలకు కేరాఫ్. ఒకప్పుడు ఇక్కడ కరణం బలరాం వర్సెస్ బాచిన చెంచు గరటయ్యగా రాజకీయాలు నడిచేవి. ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ కరణం, మరి కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ బాచిన కుటుంబాల పొలిటికల్ పోరు నడిచింది. రవికుమార్ నియోజకవర్గంలో పాతుకుపోవడంతో... ప్రత్యర్ధి ఎవరైనా గొట్టిపాటికి మరోవైపునే డీకొట్టాల్సిన పరిస్ధితి ఏర్పడిందన్నది లోకల్ టాక్.
బాపట్ల జిల్లా అద్దంకిలో పొలిటికల్ సీన్ మారుతుంది. నియోజకవర్గంలో మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. పాత కొత్త ఇంఛార్జ్ లను సమన్వయం చేయకపోవడంతో అద్దంకి వైసీపీ వ్యవహారాలు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా మారిపోతున్నాయి. కొత్త ఇంఛార్జ్ వైసీపీ నేతలను కలిసేందుకు ఊరురా తిరుగుతూ ఉంటే.. పాత ఇంఛార్జ్ ఆ ఊరి నేతలతో కలిసి మీటింగ్ పెట్టి సమాలోచనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంఛార్జ్…
Driver Gets Heart Attack while Driving The School Bus in Addanki: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా అద్దంకిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఉన్నపళంగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. దాంతో స్కూల్ బస్సు రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. డ్రైవర్‌కు గుండెపోటు వచ్చినా బస్సును రోడ్డు మీదే ఆపడంతో.. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే డ్రైవర్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. Also Read:…
YS Jagan Mohan Reddy: మరోసారి అధికారంలోకి రావడం కాదు.. ఈ సారి ఏకంగా 175కి 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అందుకు గాను గడగడపకు ప్రభుత్వం పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లేలా చేశారు.. ఇక, కుదిరినప్పుడల్లా.. వరుసగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇవాళ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం… ఈ…
జిల్లాల పునర్విభజన ఆ మంత్రులిద్దరికీ తలనొప్పులు తెస్తోందా? విపక్షాల విమర్శలు.. సొంత పార్టీ నేతల ఒత్తిళ్లు.. సీఎంకు ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారా? తరుణోపాయం తోచడం లేదా? ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంత్రులెవరు? జిల్లా విభజన మార్పుకోసం మంత్రులపై ఒత్తిళ్లుప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్. ఇద్దరిలో ఒకరు సీఎం జగన్‌కు దగ్గరి బందువు.. మరొకరు ఆయనకు ఆత్మీయంగా ఉండే సహచరుడు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో ప్రకాశం జిల్లా మూడు ముక్కలైంది.…