ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలు ఎంతో హాట్ టాపిక్ గా మారాయి..మరో 5 నెలల లో ఎన్నికలు ఉండటంతో అధికార పక్షం, ప్రతి పక్షం ఎన్నికలకు వ్యూహ రచనలు చేస్తున్నాయి.. అలాగే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వున్నారు.. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం యాత్ర 2..కాగా 2018లో విడుదల అయిన యాత్ర సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమాను మహి వి రాఘవ్ తెరకెక్కించారు… ఆ చిత్రానికి కొనసాగింపుగా… వైఎస్సార్ ముద్దు బిడ్డ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర 2’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో తండ్రి మరణం తర్వాత జగన్ నాయకునిగా ఎదిగిన తీరుతో పాటు 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాజకీయ ఘటనలు కూడా చూపించబోతున్నారు..
‘యాత్ర 2′ సినిమా లో వైయస్సార్ పాత్రలో మమ్ముట్టి మరోసారి కనిపించనున్నారు. వైఎస్ జగన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇతర ఆంధ్ర రాజకీయ నాయకుల పాత్రలు కూడా ఉన్నాయి. అందులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్ర కూడా వుంది.. అయితే ఆ పాత్రను చేయడానికి కు పాన్ ఇండియా నటుడిని చిత్ర యూనిట్ ఎంపిక చేశారు.’యాత్ర 2’ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కూడా మొదలైనట్లు తెలుస్తుంది.. హిందీ, మరాఠీ సినిమాలతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగులో ప్రభాస్ ‘సాహో’,ఎన్టీఆర్ అదుర్స్ సినిమాల తో పాటు పలు తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు.ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక నిర్మిస్తున్న చిత్రమిది.ఫిబ్రవరి 8 2024 న ఈ చిత్రం విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నద్ధం అవుతుంది.