అన్నదాతలకి ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి బాపులపాడు మండలం వేలేరు గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి నుంచి భారీ ట్రాక్టర్లు, బైక్ ర్యాలీ నడుమ గ్రామానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన యార్లగడ్డ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన ఆయన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
ఇక, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పూర్తి స్థాయిలో మేలు జరిగింది.. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకున్న నాధుడేలేడని యార్లగడ్డ వెంకట్రావ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ధాన్యం కొనే దిక్కు లేక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనే పరిస్థితిలో ప్రభుత్వం లేదని ఆయన విమర్శించారు. టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు మద్దతు ధర లభించింది.. నేడు పంటలు అమ్ముకునే పరిస్థితే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని మరో వంద రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు న్యాయం చేస్తామని యార్లగడ్డ హామీ ఇచ్చారు. రైతులు ఆధ్యర్య పడవద్దని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతాంగ సమస్యలపై దృష్టి సారిస్తామని వెంకట్రావ్ పేర్కొన్నారు.
Read Also: Sharad Pawar: నా పార్టీని అన్యాయంగా లాగేసుకున్నారు.. ఈసీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు శరద్ పవార్..
అయితే, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయ కర్త చలమల శెట్టి రమేష్ బాబు, బాపులపాడు మండల టీడీపీ అద్యక్షులు దయాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యం, రాష్ట్ర టీడీపీ నాయకులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, దొంతు చిన్న, గుండపనేని ఉమా వరప్రసాద్, మూల్పూరి సాయి కళ్యాణి, వేగిరెడ్డి పాపారావు, జిల్లా టి.డి.పి నాయకులు గుజ్జర్లపూడి బాబురావు, మొవ్వ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.