hyderabad Crime: హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది.. తీగలగూడలో మొండెం లేని గుర్తు తెలియని మహిళ తల లభ్యం అయ్యింది.. ఓ నల్ల కవర్‌లో మహిళ తల నుంచి మూసి పరివాహక ప్రాంతంలో విసిరేసి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలను స్వాధీనం చేసుకున్నారు.. హత్య చేసి తలను తెచ్చి పడవేశారని భావిస్తున్నారు.. హత్యకు గురైన మహిళ ముస్లిం మహిళగా అనుమానిస్తున్నారు పోలీసులు.. అయితే, మహిళను ఎక్కడ హత్య చేశారు.. తల ఇక్కడ పడేశారు.. మరి మొండెం ఎక్కడ ఉంది? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.. వివరాలు సేకరించడంలో భాగంగా క్లూస్. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు మలక్‌పేట్ పోలీసులు.. మహిళ పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. గతంలో.. క్షుద్రపూజల నేపథ్యం, మరికొన్ని కారణాలతో ఓ దగ్గర మొండెం.. మరో దగ్గర తల లభించిన ఘటనలు లేకపోలేదు..
Read Also: Liquor Allergy: మందు బాబులు అలర్ట్.. లిక్కర్ అలర్జీ ముప్పు.. హైదరాబాద్‌లో తొలి కేసు..