Mamata Banerjee : లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐక్య విపక్ష కూటమి ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట్ల టీఎంసీ మద్దతు ఇస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఐక్యతకు సంబంధించి టీఎంసీ వ్యూహాన్ని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
Also Read : Python As Weapon: పెంపుడు పైథాన్‌ను ఆయుధంగా వాడి.. వ్యక్తిపై దాడి
Also Read
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఆ పార్టీ పోరాడుతుంది అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. వారికి మేము సపోర్ట్‌గా నిలుస్తామని తెలిపారు. అందులో తప్పేమీ లేదు. అయితే వారు కూడా ఇతర రాజకీయ పార్టీలకు సపోర్ట్‌గా నిలవాలి సెక్రటేరియట్‌లో జరిగిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీ పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు ఫార్ములా విషయంలోనూ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
Also Read : CM KCR : గ్రాండ్ మాస్టర్ ప్రణీత్ శిక్షణ కోసం 2.5కోట్ల సాయం ప్రకటించిన కేసీఆర్
కాగా, కర్ణాటక ఫలితాల్లో బీజేపీ అధికారం కోల్పోయిన వెంటనే మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలకు సెల్యూట్ చేశారు. కాంగ్రెస్ పేరు మాత్రం ఆమె ప్రస్తావించ లేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న మమతా బెనర్జీ ఆ తర్వాత పార్టీని వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఎంసీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఐక్య కూటమి ఏర్పాటు అవసరాన్ని మమతా బెనర్జీ గట్టిగా చెబుతున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇటీవల ఆ ప్రయత్నాలను వేగవంతం చేశారు. పలు రాష్ట్రాల్లో పర్యటించి బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలను కలుస్తున్నారు. జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్‌ను కలుపుకోకుండా విపక్ష ఐక్యత సాధ్యం కాదనే సంకేతాలు కూడా ఆయన ఇచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీకి టీఎంసీ మద్దతు ఉంటుందని మమత ప్రకటించడం విపక్ష ఐక్యతా ప్రయత్నాల్లో మరో ముందడుగుగా విశ్లేషకులు అంటున్నారు.
తాజావార్తలు
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!