Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: ఇండియన్ హిస్టరీలోనే భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో ‘రామాయణం’ ఒకటి. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, సన్నీ డియోల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. నాలుగు నిమిషాల ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్లో నవంబర్ 6 అనే తేదీ కనిపించడంతో అసలు సినిమా భారత్‌లో కూడా అదే రోజు విడుదలవుతుందా అనే సందేహం మొదలైంది. ఈ ఏడాది దీపావళి నవంబర్ 8న ఉండటంతో అభిమానుల్లో మరింత గందరగోళం ఏర్పడింది. ఈ ప్రశ్నలకు నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా సమాధానం ఇచ్చారు. భారత్‌లో ‘రామాయణం’ దీపావళి సందర్భంగా విడుదల కానుందని ఆయన స్పష్టం చేశారు. అంటే భారతీయ ప్రేక్షకులు నవంబర్ 8న ఈ భారీ పౌరాణిక చిత్రాన్ని థియేటర్లలో చూసే అవకాశం ఉంది. అయితే విదేశీ మార్కెట్లలో మాత్రం సినిమా నవంబర్ 6నే విడుదల కానుంది. దీంతో ట్రైలర్లో కనిపించిన నవంబర్ 6 తేదీ ఇండియన్ రిలీజ్ డేట్ కు సంబంధించినది కాదనే విషయం స్పష్టమైంది.
విదేశాల్లో రెండు రోజుల ముందుగానే సినిమా విడుదల చేయడం వెనుక ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్, వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సినిమాల రిలీజ్ లు సాధారణంగా శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. 2026 నవంబర్ 6 శుక్రవారం కావడంతో విదేశాల్లో ఆ తేదీని ఎంచుకున్నట్లు నమిత్ మల్హోత్రా వివరించారు. భారత్‌లో మాత్రం దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 8న విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా విదేశాల్లో రెండు రోజుల ముందుగానే సినిమా విడుదల కావడం వల్ల అక్కడి వారాంతపు వసూళ్లను పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం మేకర్స్‌కు లభిస్తుంది. అయితే ఒక సినిమా విదేశాల్లో ముందుగా విడుదలైన తర్వాత అక్కడి నుంచి కీలకమైన సన్నివేశాలు ఆన్‌లైన్‌లోకి వస్తే భారతీయ ప్రేక్షకుల థియేట్రికల్ అనుభవం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయాన్ని మేకర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాల్సి ఉంది.
Also Read
- Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
- Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించనుండగా, యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సాయి పల్లవి సీత పాత్రలో, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. ఇంతటి భారీ తారాగణంతో పాటు అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అందుకే దీనిని భారతీయ సినిమా నుంచి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా చిత్ర బృందం చూస్తోంది. మొత్తంగా చూస్తే ‘రామాయణం’ రిలీజ్ డేట్ విషయంలో ప్రస్తుతం ఉన్న క్లారిటీ ఇదే. నవంబర్ 6న విదేశీ మార్కెట్లలో సినిమా విడుదల కానుండగా, భారతీయ ప్రేక్షకుల కోసం దీపావళి సందర్భంగా నవంబర్ 8న థియేటర్లలోకి తీసుకురావాలనేది మేకర్స్ ప్రణాళిక. రెండు రోజుల ముందుగానే విదేశాల్లో విడుదల చేయడం వల్ల అంతర్జాతీయ బాక్సాఫీస్‌కు ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నా, పైరసీ, స్పాయిలర్లను నియంత్రించడం మాత్రం కీలకం కానుంది.
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!