ప్రణీత్ చెస్ క్రీడలో సూపర్ గ్రాండ్ మాస్టర్ గా ఎదిగేందుకు కావాల్సిన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లను సాయంను సీఎం కేసీఅర్ ప్రకటించారు. అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’ హోదాకు అర్హత సాధించడం పై హర్షం వ్యక్తం చేశారు కేసీఅర్. గ్రాండ్ మాస్టర్ హోదాను ప్రకటించిన నేపథ్యంలో సోమవారం సెక్రటేరియట్ కు పిలిపించుకుని ప్రణీత్ ను కేసీఅర్ దీవించారు. కష్టపడి ప్రణీత్ కు శిక్షణ ఇప్పించి, గొప్పగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను కేసీఅర్ అభినందించారు. అంతేకాకుండా.. ప్రణీత్ కు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని కేసీఅర్ హామీ ఇచ్చారు.
Also Read : SRH vs GT: చితక్కొడుతున్న జీటీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడలో రాణిస్తూ వరల్డ్ చెస్ ఫెడరేషన్ ద్వారా ‘ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్’ గా గుర్తింపు పొందిన దళిత క్రీడాకారిణి వీర్లపల్లి నందిని (19) ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. నందిని అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో కీర్తిశిఖరాలను అధిరోహించేందుకు అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 50 లక్షలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం కేసీఆర్ తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని ఆదేశించారు.
Also Read : Wrestlers : ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చేస్తాం.. ఇండియన్ రెజ్లర్స్ కీలక నిర్ణయం..