India break world record for scoring fastest team 100 in Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో భారత పురుషుల జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ సేన ఈ రికార్డు నెలకొల్పింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 12.2 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేరుపై ఉంది.
2001లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 13.2 ఓవర్లలో 100 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా శ్రీలంక 21 ఏళ్ల పాటు కొనసాగింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ మరో 6 బంతులు ముందుగానే ఈ రికార్డు అందుకుంది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఈ రికార్డు నెలకొల్పారు. రోహిత్ 35 బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా.. జైస్వాల్ 30 బంతుల్లో 38 పరుగులు చేశాడు. జైస్వాల్, రోహిత్ కలిసి 98 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ ఔట్ అనంతరం జైస్వాల్, గిల్ కలిసి జట్టు స్కోరుని 100 దాటించారు.
Also Read: Ishan Kishan Six: విరాట్ కోహ్లీ నిర్ణయంతోనే ఈ హాఫ్ సెంచరీ సాధ్యమైంది: ఇషాన్ కిషన్
టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా (Fastest 100 Runs By Team in Test Cricket History) ప్రస్తుతం భారత్ ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక ఉంది. ఈ జాబితాలో ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉంది. 1994లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ 13.3 ఓవర్లలో 100 రన్స్ చేసింది. 2012లో వెస్టిండీస్ జట్టుపై బంగ్లాదేశ్ 13.4 ఓవర్లలో 100 రన్స్ చేయగా.. 2022లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ 13.4 ఓవర్లలో సెంచరీ మార్క్ అందుకుంది.
టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్లు:
1) భారత్ vs వెస్టిండీస్, 2023 – 12.2 ఓవర్లు
2) శ్రీలంక vs బంగ్లాదేశ్, 2001 – 13.2 ఓవర్లు
3) ఇంగ్లండ్ vs దక్షిణాఫ్రికా, 1994 – 13.3 ఓవర్లు
4) బంగ్లాదేశ్ vs వెస్టిండీస్, 2012 – 13.4 ఓవర్లు
5) ఇంగ్లండ్ vs పాకిస్థాన్, 2022 – 13.4 ఓవర్లు
Also Read: Wife Marriage: అచ్చు ‘కన్యాదానం’ సినిమా మాదిరి.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త!