Kamala Harris: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం 2024 యూఎస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను నామినేట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగే పోటీలో నిలిచింది. భారతీయ- ఆఫ్రికన్ మూలానికి చెందిన కమలా హారిస్ పేరును బైడెన్ సిఫార్సు చేశారు. ఈ ఏడాది కమలా హారిస్‌ను మా పార్టీ అభ్యర్థిగా చేయడానికి నా పూర్తి మద్దతు, సహకారం అందించాలని కోరుకుంటున్నానని జో బైడెన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. డెమోక్రటిక్ పార్టీ మొత్తం ఏకమై ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది అని బైడెన్ తెలిపాడు.
Read Also: Bhadrachalam: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక.. నీటిమట్టం 46.5 అడుగులు
ఇక, కమలా హారిస్ ఎవరు, ఆమె రాజకీయ ప్రయాణం ఎలా కొనసాగిందో తెలుసుకుందాం.. 1964లో కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో జన్మించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైకి చెందిన వ్యక్తి.. క్యాన్సర్ పరిశోధకురాలు.. కమలా తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకన్ ఆర్థికవేత్త అమెరికాకు వలస వచ్చారు. కమలా హారిస్ తల్లిదండ్రులు ఆమె ఏడేళ్ల వయస్సులో ఉన్నాప్పుడే విడాకులు తీసుకోగా.. ఈమెకు మాయ అనే సోదరి కూడా ఉంది.
Read Also: AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
కాగా, తన 12 ఏళ్ల వయస్సులోనే తన తల్లి, సోదరితో కెనడాకు వెళ్లి.. క్యూబెక్‌లోని ఉన్నత పాఠశాల ఆ తర్వాత హోవార్డ్ విశ్వవిద్యాలయంలో చేరేందుకు యునైటెడ్ స్టేట్స్‌కు తిరిగి వచ్చింది. ఆ తరువాత కమలా హారిస్ 1989లో హేస్టింగ్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి న్యాయ పట్టా పొందారు. ఇక, 1990లో స్టేట్ బార్ ఆఫ్ కాలిఫోర్నియాలో చేరగా.. ఆ తర్వాత ఓక్లాండ్‌లోని అల్మెడ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో పిల్లల లైంగిక వేధింపుల కేసులను విచారించే అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీగా జాయిన్ అయింది. 2003లో శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీకి పోటీ చేసి ఎన్నికలలో విజయం సాధించింది.
Read Also: Budget 2024: బడ్జెట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న పన్ను చెల్లింపుదారులు
అయితే, 2010లో కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ ఎన్నికలలో గెలిచింది. అలాగే, 2014లో లాస్ ఏంజిల్స్‌లో ఆమె సోదరి మాయ నిర్వహించిన చిన్న వేడుకలో డౌగ్ ఎమ్‌హాఫ్ అనే అటార్నీని పెళ్లి చేసుకుంది. వీరికి ఎల్లా, కోల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2016లో అప్పటి అధ్యక్షుడు బారక్ ఒబామా, జో బైడెన్ మద్దతుతో కమలా హారిస్ యూఎస్ సెనేట్‌కు పోటీ చేసి విజయం సాధించింది.
Read Also: SBI SO 2024: స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను కోరుతున్న ఎస్బిఐ..
దీంతో, 2019లో సెనేట్‌లో ప్రమాణ స్వీకారం చేసిన రెండేళ్ల తర్వాత కమలా హారిస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, రోజు రోజుకు డెమోక్రటిక్ పార్టీలో హారిస్ మంచి ఆదరణ లభించింది. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో నిలకడగా ప్రజల మద్దతు పొందేందుకు బాగా కష్టపడాల్సి వచ్చింది. బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో 2019లో ఆమె ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకున్నారు. ఇక, 2020లో బోడెన్ వైఎస్ ప్రెసిడెంట్ గా ఆమెను ఎంచుకున్నారు. కాగా, ఇప్పుడు జో బైడెన్ 2024 అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో కమలా హారిస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.