నేడు రుషికొండ భవనాల ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, మంత్రి రోజా పాల్గొననున్నారు. దాదాపు రూ.450 కోట్లు పెట్టి సీఎం క్యాంపు కార్యాలయం రుషికొండపై నిర్మించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం విడుదలకానున్నది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నది. పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసి, కొత్త పోస్టులను కలుపుకొని నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులున్నాయి. అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు.
యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. నేడు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చింది. అక్రమ మైనింగ్ కుంభకోణం విషయంలో 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది.
నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. గురువారం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. 100కు పైగా స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ఫైనల్ చేయనుంది.
నేడు నిజామాబాద్ జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. విజయ సంకల్ప బస్సు యాత్ర ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు.
నేడు తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవనున్నాయి. ఇంటర్ రెండో సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు పేపర్ సెట్ A ఎంపిక అయింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.