నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. జనజాతర పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. హాజరుకానున్న ఖర్గే, రాహుల్‌గాంధీ, రేవంత్, నేతలు. జాతీయ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్ గాంధీ. 10 లక్షల మంది జన సమీకరణకు కాంగ్రెస్ ప్రణాళిక.
నేడు పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు. క్రోసూరు, సత్తేనపల్లి బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,980 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,150 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.85,000 లుగా ఉంది.
నేడు రాజమండ్రిలో పురందేశ్వరి పర్యటన. రాజమండ్రి బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న పురందేశ్వరి. పార్లమెంట్ నియోజకవర్గస్థాయి ఎన్టీఏ సమీక్ష సమావేశంలో పాల్గొననున్న పురందేశ్వరి.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర. తొమ్మిదో రోజు చేరుకున్న జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర. నేడు కావలిలో జగన్ ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభ. నేడు చింతపాలెం నుంచి కోవూరు క్రాస్, సున్నబట్టి, గౌరవరం మీద యాత్ర.
ఐపీఎల్‌లో నేడు రాజస్తాన్ వర్సెస్ బెంగళూరు. జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షభం. నేడు సిరిసిల్లలో జేఏసీ ఆధ్వర్యంలో నేతన్నల మహాగర్జన. పార్టీలకతీతంగా నేతన్నల పోరుబాట. ఆదుకోవాలంటున్న చేనేత కార్మికులు.
నేడు సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో రైతు దీక్ష. హాజరుకానున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
నేడు సంగారెడ్డి జిల్లాలో హరీష్ రావు పర్యటన. రైతు దీక్షలో పాల్గొననున్న హరీష్ రావు.