మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపే సత్తా నాకే ఉంది..
అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ నుంచి ఆయన జూనియర్ నిక్కీ హేలి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్దం ఆపేసత్తా నాకే ఉందని ఆయన అన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ రష్యాను చైనా చేతుల్లో పెట్టారని విమర్శించారు.సోమవారం ఆయోవాలోని డావెన్‌పోర్ట్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఈ విషయం చెప్పారు. ప్రపంచానికి ఇంతకంటే పెద్ద ప్రమాదకరమైన సమయాన్ని నేనెప్పుడు చూడలేదని ఆయన అన్నారు. అభిమానులు, అనుచరుల కేరింతల మధ్య ఆయన మూడో ప్రపంచయుద్దాన్ని ఆపుతానని ప్రకటించారు. తాను వ్లాదిమిర్ పుతిన్ తో మంచి సంబంధాలను కలిగి ఉన్నానని, రష్యా అధ్యక్షుడు తన మాటను వింటాడని, ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చూపించేందుకు నాకు ఒక రోజు కన్నా ఎక్కువ సమయం పట్టదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఈసారి పెన్షన్ల పంపిణీ ఏప్రిల్ 3నే.. ఎందుకంటే?
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావటం పై ముఖ్యమంత్రి జగన్ కు మంత్రులు అభినందించారు సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ. అభినందనల తీర్మానాన్ని ధర్మాన ప్రసాదరావు ప్రవేశ పెట్టారు.పెన్షన్లను ఏప్రియల్ 3వ తేదీన పంపిణీ చేయనున్నాం. ఏప్రియల్ ఒకటిన ఆర్బీఐ శెలవు, రెండో తేదీన ఆదివారం కావటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం. ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాట బృందానికి ముఖ్యమంత్రి క్యాబినెట్‌లో అభినందనలు తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా కమిషన్ కాల పరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్ళకు తగ్గించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అవసరమైతే రెండో టర్మ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ సదుపాయం కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచారు. ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం. హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడింది. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తారు. టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసింది కేబినెట్.
ఇది హ్యాకింగా, హానీ ట్రాపా, లీకా తేల్చాలి
హాత్ సే హాత్ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నిజామాబాద్‌లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మోపాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీపీసీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వెనుక ఏం జరిగింది? అసలు కారణాలు ఏంటో అధికారులు కానీ, సీఎం కానీ వివరణ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నారన్నారు. వివిధ పార్టీల నుండి ఫిరాయించిన వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌లుగా చేశారన్నారు. ఇది రాజకేయ పునరావాస కేంద్రంగా మారిందని ఆయన మండిపడ్డారు. గ్రూప్1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వస్తున్నాయని, ప్రశ్నాపత్రాలు సేఫ్ కస్టడీలో ఉండాలన్నారు. కమిషన్ చైర్మన్, సెక్రెటరీ ల పరిధిలో మాత్రమే ఉండే ప్రశ్నపత్రాలు ఇతరుల చేతికి ఎలా వెళ్లాయని ఆయన అన్నారు. కంప్యూటర్ పాస్ వర్డ్, కోడ్ ప్రవీణ్ అనే వ్యక్తి వద్దకు ఎలా వచ్చాయని, ఇది హ్యాకింగా, హానీ ట్రాపా, లీకా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. గత 9 ఏళ్లలో ఏ పోటీ పరీక్షలు కానీ తప్పులు లేకుండా నిర్వహించలేక పోయారన్నారు.
కేంద్రం నోట్ల రద్దు వల్ల 62 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి
కేంద్రం నోట్ల రద్దు వల్ల 62 లక్షల మంది ఉద్యోగాలు పోయాయని, దేశ జీడీపీ పడిపోయిందన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లు ప్రింటింగ్ కు 21 వేల కోట్లు ఆర్‌బీఐ ఖర్చు చేసిందన్నారు. నోట్ల రద్దు నిర్ణయం నష్టాలకు కేంద్రం ఇచ్చే సమాధానం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఇదే బీజేపీ పార్టీ.. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే నియంత్రణ చేస్తారని, నీతి ఆయోగ్ ను కేంద్రం పట్టించుకోదన్నారు. బీజేపీ చేసేది అప్పులు… చేసేది తప్పులు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు పై దేశ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల రద్దుపై కేంద్రం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. దేశంలో మతపిచ్చిని రెచ్చగొట్టడంలో మాత్రం బీజేపీ సక్సెస్ అయ్యిందని ఆయన ఆరోపించారు. మంచి లక్ష్యంతో చేస్తున్నామని మోడీ చెప్పారు… మేము నమ్మి అప్పడు మద్దతు ఇచ్చామన్నారు.
ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్.. మౌలిక వసతులకు రూ.1000 కోట్ల సాయం
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్‌లో ఉమ్మడి మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వెల్లడించారు. బల్క్ డ్రగ్ పార్క్‌లో మౌలిక వసతుల కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాజ్యసభలో మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో బల్క్ డ్రగ్ పార్క్‌లను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో ఎయిర్ కార్గో టెర్మినల్, విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్ వంటి రవాణా వసతులు సిద్ధంగా ఉన్నందున ఫార్మా కంపెనీలను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని బల్క్ డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబిచ్చారు.
కేబినెట్లో మార్పులు మీడియా ఊహ మాత్రమే
ఏపీ కేబినెట్లో త్వరలో మార్పులు తప్పవంటూ వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు మంత్రి వేణుగోపాల కృష్ణ. క్యాబినెట్ లో మార్పులు అన్నది మీడియా ఊహ అని ఆయన అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గతంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోనే విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని చెప్పారు. పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర మంత్రులు కూడా విశాఖను రాజధానిగా ఆహ్వానించారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు ఉన్నపళంగా ఎందుకు వెళ్ళి పోయారో అర్థం కాలేదన్నారు. రాజకీయ పరిణతి కోల్పోయినట్లు కనిపిస్తోంది. పోలవరంలో తప్పులు చేసింది చంద్రబాబే. పవన్ కళ్యాణ్ కు వాస్తవాలు తెలియవు. తెలంగాణలో 26 బీసీ కులాలను బీసీ జాబితా నుంచి తీసేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదు. ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ సీఎంకు ఈ అంశం పై లేఖ రాశారన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ.
బాలీవుడ్ ‘ఛత్రపతి’ గానే బెల్లంకొండ!
రాజమౌళి-ప్రభాస్ కలయికలో రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సినిమా ‘ఛత్రపతి’. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేకే చేసే సాహసానికి పూనుకున్నాడు బెల్లంకొండవారబ్బాయి సాయి శ్రీనివాస్. 2014లో ‘అల్లుడు శ్రీను’తో కెరీర్ మొదలు పెట్టిన బెల్లంవారబ్బాయి ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడకున్నా మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు. 2019లో ‘రాక్షసుడు’తో హిట్ కొట్టినా ఆ తర్వాత వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ నిరాశపర్చటంతో కొద్దిగా స్పీడ్ తగ్గించాడు సాయిశ్రీనివాస్. అయితే అనూహ్యంగా ‘ఛత్రపతి’ ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తూ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక ఈ సినిమాకు తనని హీరోగా పరిచయం చేసిన వివివినాయక్ దర్శకుడు కావటంతో అంచనాలు పెరిగాయి. ఏమైందో ఏమో కానీ ఈ సినిమా పూర్తయి రిలీజ్ కావటానికి బాగా టైమ్ తీసుకుంది. అందుకు కారణం విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కావటంతో పాటు హిందీ టైటిల్ వారి వద్ద లేకపోవడమే అని వినిపించింది.
అదిరిపోయే ఫీచర్స్.. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్
తక్కువ ధరలో బడ్జెట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ అదిరేటి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు నోకియా కంపెనీ ముందుకొచ్చింది. మరొకొద్ది రోజుల్లో ఈ ఫోన్ మార్కెట్ లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఆ మొబైల్ ధర ఎంతో తెలుసా.. కేవలం రూ. 5,999 మాత్రమే.. మార్చి 17 నుంచి అమెజాన్ లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటుగా నోకియా జీ400 5జీ ఫోన్ ను కూడా భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. హెచ్ఎండీ కంపెనీ. మరి వీటిలో ఉన్న ఫీచర్ లేంటో తెలుసుకునేందుకు కస్టమ్లు తెగ ఆరాటపడుతున్నారు. ఈ ఫోన్ కేవలం రూ. 5,999 ధరకే నోకియా సీ12 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తోంది. ఇది ఎంట్రీలెవెల్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ పనిచేస్తోంది. ఇందులో హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, భారీ బ్యాటరీ లాంటి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మొబైల్ విశేషం ఏంటంటే.. సంవత్సరం పాటు రీప్లేస్మెంట్ గ్యారెంటీ కూడా అందిస్తోంది నోకియా కంపెనీ. అప్పటికే నోకియా కంపెనీ రూ. 5,499 ధరలో నోకియా సీ01 పేరుతో ఓ బడ్జెట్ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దానికంటే ఎక్కువ ధరలో నోకియా సీ12 రిలీజ్ చేయడం విశేషం. మరి స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు 6.53 అంగుళాల హెచ్డీ+డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 8ఎంపీ బ్యాక్ కెమెరా, 5ఎంపీ ప్రంట్ కెమెరా, 2/64 జీబీల మెమరీ స్టోరేజ్, 3,000mAh సామర్థ్యం గల బ్యాటరీ, 5వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వీటితో పాటుగా ఈ ఫోన్ లో మరికొన్ని ఫీచర్లు ఉన్నాయి.