అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నారు.. బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ అవన్నీ విఫలం కావడంతో బాధపడుతుంటారు.. అలాంటివారికోసం అద్భుతమైన చిట్కాలు.. ఈ జ్యూస్ లతో అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు.. అదేలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఐదు రకాల జ్యూసులు తాగితే మాత్రం బరువు తగ్గడం ఖాయం అంటున్నారు వైద్యులు.. మరి ఇటువంటి జ్యూసులు తాగితే తొందరగా బరువు తగ్గుతారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ కి బదులుగా గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. ఈ గోధుమ గడ్డిని ఇంట్లోనే ఈజీగా తయారు పెంచుకోవచ్చు. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటికి వెళ్లిపోయి త్వరగా సన్నగా అవుతారు. కరివేపాకు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కరివేపాకు కూరల్లో కాకుండా డైరెక్ట్ గా జ్యూస్ చేసుకొని తాగితే తొందరగా సన్నబడతారు. దీనికోసం గుప్పెడు కరివేపాకు గ్లాస్ నీళ్ళల్లో వేసి మరిగించుకోవాలి…
అందులో టేస్ట్ కోసం కొంచెం తేనేను వేసుకున్న మంచిదే.. ఇది అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయ పడుతుంది.. అలా బీట్ రూట్ జ్యూస్ విషయానికొస్తే.. బీట్రూట్ రెండు క్యారెట్లు కలిపి జ్యూస్ లా తయారు చేసుకుని తీసుకోవాలి. దీనిలో ఉండే ఫైబర్ విటమిన్ ఏ,సి అధిక బరువును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది… ఈ జ్యూస్ ను తాగితే త్వరగా సన్న బడతారు.. అలాగే బొప్పాయి జ్యూస్ కూడా మంచిదే.. కొవ్వును త్వరగా కరిగిస్తుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.