చాలా మందికి పరగడుపున వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. కొంతమంది నిమ్మకాయ రసం వేసుకొని తాగుతారు.. మరికొంతమంది జీరా పొడి లేదా అల్లం రసం వేసుకొని తాగుతారు.. ఈ సీజన్ లో అల్లం వేసుకొని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,విటమిన్ సి,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..పరగడుపున తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. పరగడుపున చిన్న అల్లం ముక్క లేదా అల్లం రసం తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తాగితే సరిపోతుంది.. ఇలా రోజూ తీసుకోవడం వల్ల నీరసం అలసట అనేవి లేకుండా ఉంటాయి..
ఎసిడిటీ,మలబద్ధకం,కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు చిన్న అల్లం ముక్కను తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండి ఆ సమస్యల నుంచి బయటపడతారు. కీళ్ల నొప్పులు ఉన్నవారికి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది.. దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.. నోటి దుర్వాసన సమస్య కు చెక్ పెట్టవచ్చు.. అంతేకాదు ఇన్ ఫెక్షన్స్ నుంచి మనకు రక్షణ కలుగుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వల్ల అనేక వ్యాధులు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.