భోజన ప్రియులు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. కొందరు చేసేవి మనుషులకు నచ్చితే.. మరికొన్ని మాత్రం చిర్రత్తించేస్తున్నాయి.. ఈ మధ్య ఇలాంటి వంటల వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనం ఇస్తున్నాయి.. మ్యాగీ తో ఐస్ క్రీమ్ లాంటి వింత వంటలను మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు కొత్త వంట వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది..
ఆ వీడియోలో ఒక వ్యక్తి పుచ్చకాయతో విభిన్నంగా ప్రయత్నించాడు. వేసవి కాలంలో ప్రజలు పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ఆరోగ్యంతో పాటు శరీరానికి చల్లదనాన్ని కూడా కలిగిస్తుంది. వాటర్ మిలన్ జ్యూస్ కూడా రసాన్ని తయారు చేసి తాగుతారు. పండ్ల విషయంలో ప్రతిఒక్కరూ తాజా పండ్లను నేరుగా తినడానికే ఇష్టపడతారు. అయితే, పుచ్చకాయను నూనెలో వేయించి తినటం ఎప్పుడైనా చూశారా? కనీసం ఇలాంటి డిష్ ఉందని విన్నారా?..
పుచ్చకాయను పొట్టు కూడా తియ్యకుండా సలసలా కాగే నూనెలో డీ ఫ్రై చేస్తాడు . ఈ కాయకు ఎదో పిండిని పూశాడు.. అటు, ఇటు పుల్లలను గుచ్చి డీప్ ఫ్రై చేస్తాడు. అప్పుడు పిండి పూత పూర్తిగా ఉడికిన తర్వాత పొట్టు తీయకుండా తింటాడు .. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తున్నాడు.. ఇదేం దరిద్రం రా బాబు.. ఇలాంటివి తింటే పోతారు అంటూ కామెంట్లు పెడుతున్నారు..ఇలాంటి ఐడియాలు మీకెలా వస్తాయి రా బాబు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..