ఇండియా-నెదర్లాండ్స్ మ్యాచ్ అనంతరం.. మైదానంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. నెదర్లాండ్స్ క్రికెటర్ రైలోఫ్ వాన్డెర్మెర్వ్కు కోహ్లీ ఓ గిఫ్ట్ ఇచ్చాడు. తన సంతకంతో కూడిన జెర్సీని వాన్ డెర్ మెర్వ్ కు అందించాడు. కోహ్లీ జెర్సీని గిఫ్ట్ గా అందుకున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎంతో గొప్పగా ఫీలయ్యాడు. అంతేకాకుండా.. కోహ్లీకి కృతజ్ఞతలు తెలియజేశాడు.