Virat Kohli Likely to miss IND vs ENG 3rd Test: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సిరీస్ మొత్తానికి దూరమవుతాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విశాఖలో రెండో టెస్ట్ జరుగుతుండగా.. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో మ్యాచ్ ఆరంభం కానుంది. రాజ్‌కోట్ టెస్టుకు కూడా విరాట్ దూరమవుతాడని సమాచారం తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
తాజా నివేదికల ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కు విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. మూడో టెస్టుకు తాను అందుబాటులో ఉంటానో లేదో ఇంకా చెప్పలేదట. విరాట్ మళ్లీ తండ్రి కాబోతున్నాడని, ప్రస్తుతం అతను విదేశాల్లో ఉన్నాడని ఓ స్పోర్ట్స్ ఛానెల్ పేర్కొంది. దాంతో విరాట్ రాజ్‌కోట్ టెస్టు ఆడతాడా? లేదా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టుకు విరాట్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: Rohit-Kuldeep: కుల్దీప్ ఏం మాట్లాడుతున్నావ్.. రోహిత్ అసహనం! వీడియో వైరల్
అనుష్క శర్మ గర్భవతిగా ఉన్న కారణంగానే ఇంగ్లండ్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ దృవీకరించాడు. విరాట్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఇక ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ వచ్చే 3-4 రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. విరాట్ స్థానంలో రజత్ పాటిదార్ ఎంపికయిన విషయం తెలిసిందే.