Rohit-Kuldeep: కుల్దీప్ ఏం మాట్లాడుతున్నావ్.. రోహిత్ అసహనం! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma is glad to have not taken the review: వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. ఫోర్లు, సిక్సులతో కాకుండా.. తన హాస్య చతురతతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే రివ్యూ విషయంలో అంపైర్ సలహాను తీసుకోవడానికి ప్రయత్నించిన రోహిత్.. తాజాగా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఆపై తనదైన శైలిలో సంబరాలు చేసుకుని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఇంతకీ విషయం ఏంటంటే..
ఆదివారం మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ చేధనకు దిగింది. మూడో ఓవర్‌లో ఓపెనర్ జాక్ క్రాలేకు జస్ప్రీత్ బుమ్రా ఔట్ స్వింగర్ విసిరాడు. బంతి బ్యాటు దగ్గరగా వెళ్లడంతో టీమిండియా ప్లేయర్స్ ఔట్ కోసం అపీలు చేశారు. అయితే అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. దాంతో రివ్యూ తీసుకోవాలా? వద్దా? అని ఆటగాళ్లతో కెప్టెన్ రోహిత్ శర్మ చర్చించాడు. ఆ సమయంలో కుల్దీప్ యాదవ్ స్పందిస్తూ ఔట్ అని వాదించాడు, రివ్యూ తీసుకోమని రోహిత్‌తో అన్నాడు. అతడి మాటలకు రోహిత్ సంతృప్తి చెందలేదు. ‘ఏం మాట్లాడుతున్నావో అర్థమైతుందా?’ అన్నట్లుగా కుల్దీప్ వైపు రోహిత్ ఓ లుక్ ఇచ్చాడు.
Also Read
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
Also Read: Virat Kohli: ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ అథ్లెట్ల జాబితాలో విరాట్ కోహ్లీ.. ఏకైక క్రికెటర్‌గా..!
ఈ లోగా రివ్యూ కోరే సమయం 15 సెకండ్లు అయిపోయాయి. కాసేపటికి జాక్ క్రాలే నాటౌట్ అని రిప్లేలో తేలింది. దీంతో రివ్యూ తీసుకోకుండా.. మంచి నిర్ణయం తీసుకున్నానని రోహిత్ శర్మ సంబరపడ్డాడు. క్లాప్స్ కొడుతూ.. థంబ్స్ అప్ సింబల్స్ చూపించాడు. ఇది చూసిన కుల్దీప్ యాదవ్ నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన వారు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
Thanks but no thanks Kuldeep 😜
Skipper Rohit Sharma is glad to have not taken the review for that one 😂 #INDvENG #BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports #RohitSharma pic.twitter.com/hnc7iSXlo3
— JioCinema (@JioCinema) February 4, 2024
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!