Viral Video: ప్రస్తుతకాలంలో స్మార్ట్‌ఫోన్ మనిషి జీవితంలో విడదీయలేని భాగమైపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెద్దలతో పాటు చిన్న పిల్లల చేతుల్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్లు కనిపించడం ఎక్కువ అయ్యింది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను బిజీగా ఉంచేందుకు లేదా వారి అల్లరిని తగ్గించేందుకు ఫోన్ ను అలవాటు చేస్తున్నారు. అయితే, ఈ అలవాటు వల్ల పిల్లల మానసికాభివృద్ధికి తీవ్రంగా హానికరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల ఎక్కువగా పిల్లల ఆలోచనశక్తి, ఏకాగ్రత తగ్గిపోవడంతో పాటు కళ్ల సమస్యలుకు కూడా దారి తీస్తున్నాయి.
AA22xA6 : అల్లు అర్జున్ సినిమాలో మరొక స్టార్.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ అట్లీ
ఇలాంటి సమయంలో పిల్లలు మొబైల్ చుండకుండా ఉంచాలంటే అంత సులువైన విష్యం కాదండోయ్.. అయితే, ఈ సమస్యను గుర్తించిన ఒక పాఠశాల పిల్లల్లో ఫోన్‌పై అలవాటును తగ్గించేందుకు వినూత్న పద్ధతిని అనుసరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే, పాఠశాల వారు ఒక చిన్న డ్రామా చేశారు. అందులో ఒక విద్యార్థి ఎప్పటికప్పుడు ఫోన్‌లోనే మునిగి ఉంటాడు. ముఖ్యంగా తినేటప్పుడు, పడుకునే సమయంలో కూడా ఫోన్ ను వదిలిపెట్టడు. ఫోన్‌ను ఎక్కువసేపు చూసే కారణంగా అతనికి కంటి సమస్యలు వస్తాయి. చివరకు డాక్టర్ దగ్గరకు వెళ్లినట్లుగా యాక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లాడి కంటికి ఒక రక్తం వచ్చినట్లుగా, కన్ను కనపడడం లేదు అన్నట్లుగా ఉండే ఒక ప్లాస్టర్ కట్టివేస్తాడు. దీనితో ఈ సన్నివేశం చూసిన పిల్లలు ఫోన్ వల్ల కలిగే నష్టాలను స్పష్టంగా అర్థం చేసుకుంటారు.
ఇక ఆ డ్రామా ముగిసిన వెంటనే టీచర్ పిల్లలకు ఫోన్లు ఇస్తే వారు భయపడి ఫోన్ వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఫోన్ చూడగానే ఏడవడం కూడా మొదలుపెట్టారు. ఈ ఘటన పిల్లల మనసుల్లో ఫోన్ పట్ల ఉన్న ఆకర్షణ తగ్గించడంలో ఎంత ప్రభావం చూపిందో అర్థమవుతుంది. ఈ డ్రామా తర్వాత వారు ఫోన్‌ను ఆట వస్తువుగా కాకుండా, కళ్లకు హాని చేసే వస్తువుగా భావించడం చేస్తున్నారు. ఈ వీడియోను చుసిన నెటిజన్స్ స్కూల్ మేనేజ్మెంట్ ను తెగ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇలాంటివి ప్రతి పాఠశాలలో యాక్టివిటీలు చేయాలని వారు సూచిస్తున్నారు. మరికొందరేమో.. “ఎంత అద్భుతమైన ఆలోచన అంటూ” కామెంట్ చేశారు. మరికొంతమంది “ప్రతి పిల్లవాడికి ఈ వీడియో చూపించాలి” అని వారి అభిప్రాయాన్ని తెలిపారు.