Lava Play Ultra 5G: లావా (Lava) కంపెనీ తన కొత్త Play సిరీస్ లో భాగంగా ప్లే అల్ట్రా (Lava Play Ultra) అనే తాజా 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. Blaze AMOLED 2 తర్వాత లాంచ్ చేసిన ఈ ఫోన్ 6.67 అంగుళాల FHD+ AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో లాంచ్ అయ్యింది.
ఈ Lava Play Ultra 5G స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 7300 SoC ప్రాసెసర్ ఉంటుంది. HyperEngine టెక్నాలజీ ద్వారా గేమింగ్ అనుభవం మరింత మెరుగవుతుంది. ఇది 20% ఎక్కువ FPS, మెరుగైన విజువల్స్, తక్కువ పవర్ వినియోగంతో ఎక్కువ సేపు గేమింగ్‌కు అనువుగా ఉంటుంది. ఈ ఫోన్‌లో 6GB అండ్ 8GB RAMతో పాటు, 128GB UFS 3.1 స్టోరేజ్ అందించబడింది. దీనిని 1TB వరకు microSD కార్డు సపోర్ట్ ఉంది.
27 గంటల బ్యాటరీ లైఫ్, IP54 రేటింగ్తో Google Pixel Buds 2a లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా!

కెమెరా సెటప్:
ఫోటోగ్రఫీ కోసం Play Ultraలో 64MP సోనీ IMX682 సెన్సార్ కెమెరా OIS సపోర్ట్‌తో ఉంది. అంతేకాకుండా 5MP మాక్రో లెన్స్ కూడా ఉంది. నైట్ మోడ్, HDR, పోర్ట్రెయిట్, బ్యూటీ, పానొరమా, స్లో మోషన్, ప్రో మోడ్, డ్యుయల్ వ్యూ వీడియో వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో ఫ్రంట్ కెమెరాగా 13MP కెమెరాను అందించారు.
సాఫ్ట్‌వేర్, అప్డేట్స్:
ఈ స్మార్ట్‌ఫోన్ Android 15తో వస్తోంది. ముఖ్యంగా, ఇందులో ఎలాంటి బ్లోట్వేర్ లేకుండా క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవం లభిస్తుంది. కంపెనీ 2 Android అప్‌డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని తెలిపింది.

40 గంటల బ్యాటరీ లైఫ్, IP68 సర్టిఫికేషన్, AI ఆధారిత Google Pixel Watch 4 లాంచ్..!
బ్యాటరీ, ఇతర ఫీచర్లు:
లావా Play Ultraలో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఛార్జర్ బాక్స్‌లోనే లభిస్తుంది. IP64 రేటింగ్ కారణంగా ఇది డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్స్, USB Type-C ఆడియో కూడా అందుబాటులో ఉన్నాయి.

ధర, లభ్యత:
లావా Play Ultra రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB + 128GB మోడల్ ధర రూ.14,999గా, 8GB + 128GB మోడల్ ధర రూ.16,499గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్కిటిక్ ఫ్రోస్ట్, ఆర్కిటిక్ స్లాట్ అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో లభ్యం కానుంది. ఈ మొబైల్ విక్రయాలు ఆగస్టు 25 నుండి అమెజాన్ లో ప్రారంభం అవుతున్నాయి.

లాంచ్ ఆఫర్లు:
వినియోగదారుల సౌలభ్యం కోసం లావా ప్రత్యేకంగా ఇంటి దగ్గరికి వచ్చి సర్వీస్ (Free Service @ Home) సదుపాయం అందించనుంది. ఇక ICICI, SBI, HDFC బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.1000 వరకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది.