అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రక్కు.. కారును ఢీకొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. దీంతో బంధువులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఘాజీపూర్‌లో భక్తుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురి మృతిచెందినట్లు తెలుస్తోంది.
హర్యానాలోని పంచకులలో ఘోర ప్రమాదం జరిగింది. 45 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు లోయలో పడింది. చిన్నారుల బస్సులోంచి చెల్లాచెదురుగా పడిపోయారు. టిక్కర్ తాల్ సమీపంలో బస్సు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలోకి పడిపోయింది.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి పై నుంచి వాటర్ ట్యాంకర్ వెళ్లడంతో తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనం కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం.. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని షాంగ్లా జిల్లాలోని బర్బత్‌కోట్ ప్రాంతంలో సోమవారం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ఐదుగురు మరణించినట్లు స్థానిక మీడియా సంస్థ సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్యూ సిబ్బంది.. మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీసి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.
“న్యాయమైన హక్కును సాధించే వరకు” పోరాటం చేస్తామంటూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన రెండో విడత భారత్ జోడో యాత్ర ఈ నెల 14న మణిపూర్ లో ప్రారంభమై ముంబై వరకు సాగుతుందని రోడ్లు భవనాల శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గందర్‌బాల్ జిల్లాలోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వెళ్తుండగా.. ట్యాక్సీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.