Upendra: వారి గురించి నీచంగా మాట్లాడిన ఉపేంద్రపై కేసు.. స్టే ఇచ్చిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Upendra: కన్నడ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఆయన నటించిన సినిమాల్లో కూడా అలానే కనిపిస్తాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఉపేంద్ర ఒక రాజకీయ పార్టీని స్థాపించిన విషయం కూడా తెల్సిందే. దాని పేరు ప్రజాక్రియా. ఈ పార్టీ ఆఫీస్ లోనే ఉపేంద్ర తన రాజకీయ ప్రసంగాలు.. ప్రచారాలు చేస్తూ ఉంటాడు. ఉపేంద్రకు వివాదాలు కొత్తేమి కాదు. చాలా సార్లు ఆయన మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడం.. తరువాత సారీ చెప్పడం చూస్తూనే ఉన్నాం. ఇక ఈసారి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కోర్టు కేసు వరకు వెళ్లాయి. అసలు విషయం ఏంటంటే.. ప్రజాక్రియా పార్టీ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉపేంద్ర ఒక ఫేస్ బుక్ లైవ్ ను ఏర్పాటు చేసి తన పార్టీ సభ్యులతో పాటు.. అభిమానులతో కూడా మాట్లాడాడు. అందులో విపక్షాలపై విమర్శలు గుప్పించాడు.
Sadha: సెట్ లో దాన్ని చూసి గావుకేకలు పెట్టిన సదా..
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
ఇక పొరపాటున విపక్షాలను తిడుతూ.. ఓ ఊరు ఉందంటే అక్కడ కచ్చితంగా దళితులు ఉంటారు, అలానే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు ఉంటారు అంటూ నోరు జారాడు. ఇక దళితులను అంత నీచంగా మాట్లాడతాడా అంటూ దళిత సంఘాలు ఉపేంద్రపై కేసు నమోదు చేసాయి. దీంతో వెంటనే నాలుక్కర్చుకున్న ఉపేంద్ర దళితులకు సారీ చెప్పి.. ఆ వీడియోను డిలీట్ చేసాడు. అయినా దళిత సంఘాలు వదలలేదు.ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. ఇక ఈ కేసుపై కోర్టు స్టే ఇవ్వడంతో ఉపేంద్రకు కొద్దిగా ఊరట లభించింది. ఉపేంద్రపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై కర్ణాటక హైకోర్టు సోమవారం మధ్యంతర విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఇది ఇప్పటికి తాత్కాలికమే అయినా ఈ కేసు నుంచి బయటపడడం అంత ఈజీ కాదని పలువురు చెప్పుకొస్తున్నారు. మరి ఉపేంద్ర ఈ కేసు నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!