తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.. ప్రస్తుతం విలన్ గా తెలుగు, హిందీ, తమిళ్ చిత్రాల్లో నటిస్తున్నాడు.. అంత పెద్ద హీరో అయినా పెద్దలంటే అమితమైన గౌరవం.. ఎక్కడ పెద్దవాళ్ళు కనిపించినా వారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుంటాడు.. తాజాగా విజయ్ సేతుపతికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈరోజు తమిళనాట లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోలీవుడ్ స్టార్స్ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు.. ఇక సెలెబ్రేటిలతో పాటుగా సామాన్య ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సహం చూపించారు.. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్టార్స్ అందరు ఉదయమే తమ దగ్గర్లోని పోలింగ్ కేంద్రాలకు వచ్చి చేరుకున్నారు..
ఈ సందర్భంలో కోలివుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు, వీల్ చైర్‌లో నడవలేని ఒక వృద్ధురాలు ఆయన్ను సెల్ఫీ కోరింది. విజయ్ నటన అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది.. అతను భవిష్యత్ లో ఇంకా మంచి ప్రాజెక్టులు చేస్తారని చెప్పుకొచ్చింది. ఇక వెంటనే విజయ్ సేతుపతి ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకుని ఆ వృద్ధురాలితో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశాడు. ఆమె తల్లి లాంటి వ్యక్తి కావడంతో కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు.. ఆ సందర్బంగా అక్కడున్న వారు తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీరు ఓ లుక్ వేసుకోండి..
This Is Why He Is Makkal Selvan #VijaySethupathi 🥹❤️pic.twitter.com/txOW6vF731
— Kolly Corner (@kollycorner) April 19, 2024