నేషనల్ క్రష్ రష్మిక మందన్నా..ప్రస్తుతంఈ భామ పేరు బాగా ట్రెండింగ్‌లో ఉంది.రీసెంట్ గా రష్మిక కు సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది..కొందరు జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో బాగా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, ఆమె అభిమానులతో పాటు పలువురు స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం పై ముందుగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించి మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఆ వెంటనే నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ మరియు మృణాల్ ఠాకూర్ ఇలా టాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే తాజాగా రష్మిక ఫేక్ వీడియోపై టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
విజయ్ దేవరకొండ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ”భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన అడుగు ఇది. ఇలాంటి ఘటన ఇంకొకరికి జరగకూడదు.. డీప్‌ఫేక్ వీడియో చేసే వారి మీద వెంటనే చర్యలు తీసుకునేందుకు ఓ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.. వెంటనే వారిని శిక్షించాలి.. అప్పుడు మహిళలు రక్షించబడతారు అని విజయ్ రాసుకోచ్చాడు.కొందరు ఆకతాయిలు ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు. వీడియోలో రష్మిక బాగా ఎక్స్‌పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.. దీనిపై అనుమానం వచ్చిన కొందరు నెటిజన్లు.. ఇది నిజంగా రష్మిక వీడియోనేనా అని వెతికి అస్సలు నిజాన్ని బయట పెట్టారు..ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించినదిగా తేల్చారు. ఆమె వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసినట్లు వారు గుర్తించారు.