సూపర్ స్టార్ మహేశ్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సంగతి అలా ఉంటే.. ఇక ఆయన అభిమానుల సంగతి ఇంకేం చెబుతాం. మహేశ్‌బాబు పుట్టిన రోజైన.. ఆయన సినిమా ప్రీ రిలీజ్, రిలీజ్ ఇలాం ఒక్కటేంటి ఏ కార్యక్రమమైనా తమ స్టైల్‌లో సోషల్ మీడియాల్లో ట్రెండ్ సెట్ చేస్తుంటారు. అయితే.. ఇప్పుడు మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మహేశ్28వ సినిమా తెరకెక్కుతోంది. అయితే.. ఇలా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారో లేదో.. అప్పుడే ఈ సినిమా నుంచి ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. #SSMB28 Filming Begins పేరిట ఈ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో గన్, పోలీస్ స్టార్స్ ని చూడవచ్చు, అలానే వీడియోలో మహేష్ బాబు పవర్ఫుల్ కళ్ళ లుక్ ని కూడా చూపించారు. అయితే.. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేశ్‌కు సరసన మరోసారి పూజా హెగ్దే నటించనుంది. ఈ సినిమాకు ఎస్‌ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్‌బాబు కాంబోలో ఈ సినిమా మూడవది. అయితే మొదటి సినిమా అతడు బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలువగా.. ఖలేజా సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు మూడో సారి వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాల ఉన్నాయి మరీ.