Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Venturu Crime News Father Threw His Childrens Into The Canal

Crime News: అంబేద్కర్ కోనసీమలో దారుణం.. కన్న పిల్లలను కాలువలోకి తోసేసిన తండ్రి!

Published Date :March 18, 2025 , 11:33 am
By Sampath Kumar
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో దారుణం
  • కన్న పిల్లలను కాలువలోకి తోసేసిన తండ్రి
  • ప్రాణాలు కోల్పోయిన ఏడేళ్ల కారుణ్య
  • పిల్లి రాజు కోసం పోలీసుల గాలింపు చర్యలు
Crime News: అంబేద్కర్ కోనసీమలో దారుణం.. కన్న పిల్లలను కాలువలోకి తోసేసిన తండ్రి!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసేసి తండ్రి అదృశ్యమైన ఘటనతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తండ్రి పిల్లి రాజు గ్రామంలో రెండు కోట్ల రూపాయలు మేరకు అప్పులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక అదృశ్యం అయ్యాడు. పిల్లలు సందీప్, కారుణ్యలను రామచంద్రపురం మండలం తొగరువారి సావరం కాలువలో తోసివేసి.. ఆపై అదృశ్యమయ్యాడు. బాలుడు ఎలాగోలా ఒడ్డుకు చేరినా.. ఏడేళ్ల కారుణ్య ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని చూసి తల్లి విజయ శోకంలో మునిగిపోయారు. ఆర్థిక సమస్యలుంటే పరిష్కార మార్గాలు ఉంటాయని.. ఇలా చిన్నారులను తండ్రే ప్రాణాలు తీయాలనుకోవడం పట్ల వెంటూరు గ్రామంలో ఆవేదన వ్యక్తమవుతోంది.

చెల్లెలు, తనను స్కూలు నుండి తీసుకుని వెళ్లి చనిపోదామని తండ్రి రాజు చెప్పాడని అంటున్నాడు ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన కుమారుడు సందీప్. మొదట తనను, తర్వాత చెల్లిని కాలువలోకి తోసివేశాడని చెబుతున్నాడు. తాను కాలువలో ఊస పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డానని, చెల్లి కాలువలో మునిగిపోయి చనిపోయిందని చెప్పాడు. ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగి ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో విషయం చెప్పినట్లు సందీప్ తెలిపాడు.

Also Read

  • Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!
  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
  • Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
Add as a preferred
source on google

గ్రామస్తుల నుండి రెండు కోట్ల రూపాయలకు అప్పులు చేసి.. తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో పిల్లి రాజు అదృశ్యం అయ్యాడని గ్రామస్తులు వాపోతున్నారు. కుమార్తెను చంపివేయటం దారుణమని ఆవేదన చెందుతున్నారు. కూలి నాళీ చేసుకుంటూ కష్టపడిన సొమ్ములు దాచుకుంటే.. ఫైనాన్స్ వ్యాపారి రాజు ఈ విధంగా చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో అదృశ్యమైన ఫైనాన్స్ వ్యాపారి పిల్లి రాజు ఏమైపోయాడనేది మిస్టరీగా మారింది. గ్రామస్తులు నుండి అప్పులు తీసుకున్న రెండు కోట్ల రూపాయలు రాజు ఏం చేశాడు?, రాజు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడనే ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ద్రాక్షారామం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన పిల్లి రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ambedkar konaseema
  • ap
  • Crime News
  • Venturu
  • Venturu Crime News

తాజావార్తలు

  • Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

  • Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల

  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!

  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.

  • MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions