బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిన్న రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి బరిలో దిగనున్న అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ లిస్ట్‌లో 7గురు సిట్టింగ్‌ల స్థానాల్లో మార్పులు చేసింది బీఆర్‌ఎస్ అధిష్టానం. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు స్థానంలో చల్మెడ లక్ష్మీనరసింహకు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలో వేములవాడ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. దీంతో.. బీజేపీ వైపు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ తో టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో. ఈ క్రమంలోనే.. చెన్నమనేని రమేష్ బాబు ఈ నెల 25న జర్మనీ నుంచి వేములవాడకు రానున్నారు.
Also Read : Dog shocks bride groom: పెళ్లి కొడుకుకు షాక్ ఇచ్చిన కుక్క.. ఎంతపని చేసిందంటే
వేములవాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా రమేష్ బాబును నిలబెట్టాలనే యోచనను బీజేపీ అధిష్టానానికి ఇప్పటికే ఈటల తెలియజేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ లో ఉంటూ చల్మెడకు సహకరించేదేలేదన్న పట్టులో రమేష్ బాబు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. నిన్న తన భావోద్వేగం, నిర్వేదంతో కూడిన సోషల్ మీడియా పోస్టు చేశారు. అనుగుణంగా టిక్కెట్ దక్కకపోవడంపై మనస్థాపం చెందినట్లు పేర్కొన్నారు. వేములవాడలో కొనసాగుతున్న చెన్నమనేని వారసత్వానికి బ్రేక్ పడొద్దన్న భావనలో చెన్నమనేని ఫ్యామిలీ ఉన్నట్లు సమాచారం.. మరోవైపు ఈనెల 30న మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు బీజేపీలో చేరనున్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. రేపు జర్మనీ నుండి హైదరాబాద్‌కు రానున్న వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు.. సీఎం కేసీఆర్ ను కలవనున్నట్లు సమాచారం?. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కార్యకర్తలకు సూచించిన రమేష్ బాబు.. గురువారం రోజున వేములవాడలో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు.
Also Read : Poco M6 Pro 5G Price: పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ మూడోసారి ఆరంభం.. క్రేజ్ మాములుగా లేదుగా!