Buy Poco M6 Pro 5G Smartphone Only RS 10,999 in Flipkart: చైనా కంపెనీ షావోమీకి చెందిన సబ్‌బ్రాండ్ ‘పోకో’ ఇటీవల అతి తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. అదే పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. చీపెస్ట్ 5జీ ఫోన్ కావడంతో చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. దాంతో ఈ ఫోన్ స్టాక్‌లో ఉండట్లేదు. ఈ ఫోన్ కొనడానికి కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు మూడోసారి పోకో ఎం6 ప్రో 5జీ సేల్ ఆరంభం అయింది. ఈ ఫోన్ ధర ఆఫర్లో భాగంగా కేవలం రూ.10,999 కావడం విశేషం.
2023 ఆగస్ట్ 9న పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ జరిగింది. సేల్ ప్రారంభమైన 15 నిమిషాల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఖాళీ అయ్యాయని పోకో కంపెనీ ప్రకటించింది. దాంతో త్వరలోనే మళ్లీ సేల్ నిర్వహిస్తామని పోకో ఇండియా ప్రకటించింది. రెండో సేల్‌ను ఆగస్ట్ 12న నిర్వహించగా 9 నిమిషాల్లో ఔట్ ఆఫ్ స్టాక్‌లోకి వెళ్లిపోయింది. దాంతో ఈ మొబైల్ కోసం కొనుగోలుదారులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. పోకో ఎం6 ప్రో 5జీ మళ్లీ అందుబాటులోకి వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో మూడోసారి సేల్ ప్రారంభమైంది.
పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ (POCO M6 Pro 5G Forest Green, 64 GB, 4 GB RAM) అసలు ధర రూ. 14,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 26 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు రూ. 10,999 సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు రూ. 4000 ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంతో ఈ ఫోన్ మీకు మరింత తక్కువకు అందుబాటులో ఉంటుంది. మూడోసారి కూడా పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్స్ త్వరగానే క్లోస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కొనేసుకుంటే బెటర్.
Also Read: Samsung 440 MP Camera: శాంసంగ్ నుంచి 440 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు.. ధర ఊహించడం కష్టమే!
పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79 ఇంచెస్ డిస్‌ప్లే ఉంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండగా.. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ ఏఐ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్లతో కూడిన డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పోకో ఎం6 ప్రో 5జీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. అది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.