Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాస మహోత్సవాలు నేటి నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తుల రద్దీతో కిటకిటలాడే ఈ క్షేత్రంలో, ఈసారి కూడా నెల రోజులపాటు భక్తి ఉత్సవాలకు శుభారంభం అయింది. ఈ శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు ఉండటంతో.. ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం వేళ లింగార్చన కార్యక్రమం జరగనుంది. Myntra: మింత్రాకు…
Dubba Rajanna Swamy: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో వెలిసిన దుబ్బ రాజన్న స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా 2.50లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాల షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 24న…