ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హాలీవుడ్ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘మిషన్ ఇంపాసిబుల్’ సిరీస్‌లో, రీసెంట్‌గా విడుదలైన.. ‘ది ఫైనల్ రెకనింగ్’ థియేటర్లలో మే 17న విడుదలై ఘన విజయం సాధించింది. టామ్ క్రూజ్ తన అద్వితీయ యాక్షన్ పర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులను మంత్రిముగ్ధులను చేశారు. దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీ తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా 589 మిలియన్ డాలర్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎప్పటికప్పుడు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మోమెంట్స్, బ్రిలియంట్ స్క్రీన్‌ప్లే, విజువల్‌గా మైండ్ బ్లోయింగ్ సీక్వెన్సులు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా రియల్ లొకేషన్లలో టామ్ క్రూజ్ చేసిన డేంజర్ స్టంట్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ అద్భుత చిత్రం ఓటీటీ వేదికపైకి రానుంది.
సమాచారం ప్రకారం ఆగస్టు 19 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లలో రెంట్ లేదా బై ఆప్షన్‌తో స్ట్రీమింగ్ కానుందట. థియేటర్లలో మిస్ చేసినవారు, ఇంటి వద్దే డాల్బీ విజువల్స్ తో, 4K లేదా HDR ఫార్మాట్‌లలో ఈ సినిమాను ఆస్వాదించేందుకు ఇది సరికొత్త అవకాశం. టామ్ క్రూజ్ ఫ్యాన్స్‌తో పాటు యాక్షన్ లవర్స్ అందరూ ఈ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పార్ట్-2 కూడా రాబోతుండటంతో, కథ ఎక్కడ ముగిసిందో చూడాలన్న ఆసక్తి ఈ స్ట్రీమింగ్‌కి మరింత బూస్ట్ ఇవ్వబోతోంది.
ఇప్పటికే థియేటర్లలో హిట్ అయిన ఈ చిత్రం, ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందా? టెక్నికల్ ట్రీట్‌తో పాటు కథన నిర్మాణంలో చూపిన నూతనత, ప్రాధాన్యత కలిగిన పాత్రల మలుపులు ఓటీటీ వీక్షకులకు కనెక్ట్ కావొచ్చునని అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్‌కు ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఎపిసోడ్ ఒక స్పెషల్ ఫీల్‌ను ఇచ్చినట్లు, ఈ పార్ట్ కూడా భవిష్యత్తులో రానున్న మిషన్‌లకు బలమైన బేస్ లెవెల్ ఏర్పాటు చేసింది. దీంతో ఫ్రాంచైజీకి ఇది ఓ కీలక మైలురాయి గా నిలవనుంది.