తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఓదెల 2’, సూపర్నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్. సంపత్ నంది మార్గదర్శనంలో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా సాధువుగా అద్భుత నటన కనబరిచారు. ఏప్రిల్ 17న విడుదలైన ‘ఓదెల 2’ వేసవిలో ప్రధాన ఆకర్షణగా నిలిచి, అన్ని చోట్ల బ్లాక్‌బస్టర్ స్పందనతో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సందర్భంగా శక్తివంతమైన పాత్ర పోషించిన నటుడు వశిష్ఠ ఎన్. సింహ విలేకరులతో మాట్లాడారు.
సింగర్‌గా మీ ప్రస్థానం?
కన్నడలో 25కి పైగా సినిమాలకు పాడాను. తెలుగులో సింగర్‌గా అజినీష్ నన్ను పరిచయం చేశారు. ‘ఓదెల’ తర్వాత కొన్నాళ్లు పాటలు పాడలేకపోయాను.
‘ఓదెల 2’ కోసం ఎలా సిద్ధమయ్యారు?
‘ఓదెల’ కోసం బరువు పెరిగి, వర్కౌట్స్ ఆపాను. ఆ సినిమా తర్వాత రెగ్యులర్ రొటీన్లోకి వచ్చాను. ‘ఓదెల 2’ కోసం మళ్లీ బరువు పెంచాను, టాన్ చేసాను, ప్రోస్తెటిక్ మేకప్ ఉపయోగించాను. ఈవిల్ క్యారెక్టర్ కోసం ప్రత్యేక వాయిస్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేశాను, ఇది పాత్రకు బలం చేకూర్చింది.
సంపత్ నంది కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
సంపత్ నంది అద్భుతమైన వ్యక్తి. ‘ఓదెల 2’ ఐడియా చెప్పినప్పుడు ఆశ్చర్యం, ఉత్సాహం కలిగాయి. కథ చాలా కొత్తగా, యూనిక్‌గా అనిపించింది. ఇలాంటి పాత్ర గతంలో చేయలేదు, అద్భుతంగా చేయాలని నిర్ణయించుకున్నాను.
తమన్నాతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
తమన్నా సహృదయురాలు, అందరితో స్నేహంగా ఉంటారు. మొదటి సినిమా చేస్తున్నట్టు ఉత్సాహంగా పనిచేస్తారు. తన నటన, ప్రజెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
తిరుపతి పాత్రకు వచ్చిన స్పందన గురించి?
తిరుపతి పాత్ర సినిమా అంతా ప్రభావం చూపిస్తుంది. ఈ క్యారెక్టర్‌నే కథానాయకుడిగా చెప్పవచ్చు. ప్రేక్షకులు ఈ పాత్రతో బాగా కనెక్ట్ అయ్యారు, వచ్చిన స్పందన చాలా సంతోషాన్నిచ్చింది. ఇండస్ట్రీ నుంచి చాలా మంది సంప్రదించారు. పెద్ద బ్యానర్ల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.
దర్శకుడు అశోక్ తేజ గురించి?
అశోక్ తేజ మంచి స్నేహితుడు, పనిలో అత్యంత నిష్ఠ కలిగిన దర్శకుడు. స్పష్టమైన విజన్‌తో పనిచేస్తారు.
నిర్మాత డి. మధు గురించి?
మధు గారు కథపై నమ్మకంతో, ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్‌గా నిర్మించారు. కథకు అవసరమైన ప్రతిదీ సమకూర్చారు. హంబల్ తర్వాత ఇంత ప్యాషన్‌తో నిర్మించిన నిర్మాత మధు గారే.
ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటారు?
ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలు చేయాలనేది నా లక్ష్యం. పాజిటివ్, నెగటివ్ ఏవైనా, నటుడిగా మెప్పించే పాత్రలు చేయాలనుంది. ప్రతి పాత్రలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాను.