Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: గత కొంతకాలంగా ఇండియన్ సినిమాలకూ, ముఖ్యంగా తెలుగు సినిమాలకు విదేశీయుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. భారతీయ సినిమాల్లోని సంగీతం, డైలాగులు, డాన్స్‌లు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రభావంతో చాలామంది విదేశీయులు ఇండియన్ సినిమాల పాటలు, డైలాగులను అనుకరిస్తూ రీల్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదిస్తున్నారు. ప్రత్యేకించి తెలుగు సినిమా పాటలు, డైలాగులకు గ్లోబల్ లెవల్లో రెస్పాన్స్ భారీగా వస్తోంది.
Read Also: Gray Hair: తలలో తెల్ల వెంట్రుకను పీకేస్తే.. మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయా?
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ఈ నేపథ్యంలో తాజాగా టాంజానియా దేశానికీ చెందిన యువకుడు కిలీ పాల్ (Kili Paul), అతని సోదరి నీమా పాల్ (Neema Paul) కలిసి చేసిన ఓ రీల్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, త్రిష నటించిన సూపర్ హిట్ సినిమా వర్షంలోని “మెల్లగా కరుగని ఈ వర్షం సాక్షిగా” అనే పాటకు వీరిద్దరూ లిప్ సింక్ చేస్తూ అద్భుత హావభావాలతో చేసిన రీల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో వారి ముఖ ఎక్స్‌ప్రెషన్స్, లిప్ సింక్, శరీర భాష అన్నీ కూడా అసలైన నటీనటులకూ ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. నిజంగానే పాటను వారు పడేస్తున్నారేమో అనిపించేలా, ఆ పాటలోని భావాన్ని అర్థం చేసుకుని చేసినట్టు కనిపించే వీరి అభినయం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశర్యపోతున్నారు.
Read Also: Summer Holidays: వేసవి సెలవుల్లో అనారోగ్యం పాలవ్వకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
ఈ వీడియో చూసిన కొందరు.. మీరు చేసిన యాక్టింగ్ ముందు భారతీయ సినీ పరిశ్రమలలో ఎంతోమంది హీరో హీరోయిన్స్ కూడా పనికిరారని కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. మీ జోడి అదిరిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో, వీళ్ళని చూస్తే భారతదేశంలో కంటే విదేశీయులే ఇండియన్ సినిమాలను ఎక్కువగా చూస్తున్నారేమో అనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇలా విదేశీయులు భారతీయ సినీ పాటలతో రీల్స్ చేసి ప్రజాదరణ పొందడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. విదేశీయుల వీడియోలు సోషల్ మీడియా వేదికగా లక్షల సంఖ్యల వ్యూస్ తెచ్చుకుంటూ పెద్ద ఎత్తున భారతీయులను ఆకట్టుకుంటున్నారు. విదేశీయులు నిజంగా భారతీయ సంస్కృతిని, అలాగే భారతీయ సినిమాలను గ్లోబల్ లెవెల్ లో ప్రమోట్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నారు.
ఇయర్స్ తరబడి తెలుగు లో నటించే ఇతర బాషా నటులు కూడ ఇంత బాగా లిప్ సింక్ చేయలేరు 👌❤️ pic.twitter.com/y7iIpMJAWH
— ismailbhaii (@atheisttindiann) May 3, 2025
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!