నోరు జారి ఇబ్బందుల పాలవుతోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. నిజానికి ఆమె బాలీవుడ్ లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడ ఏమాత్రం వర్క్ అవుట్ కాకపోవడంతో సౌత్ కి వచ్చేసి ఇక్కడ నెమ్మదిగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అయితే నిజానికి ఆమెకు ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. హిందీలో అవకాశాలు రావడంతో అక్కడే పలు సినిమాలు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె చేసిన దేవా అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో ఆమె అల్లు అర్జున్తో కలిసి చేసిన అలవైకుంఠపురంలో సినిమా గురించి చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు చిక్కుల్లో పడింది.
Jr NTR: కబీర్ vs వీరేంద్ర రఘునాథ్.. ఎన్టీఆర్ ప్లాన్ పెద్దదే!
ఆమె మాట్లాడుతూ ఈ సినిమా ఒక తమిళ సినిమా అంటూ కామెంట్ చేసింది ఆ సినిమాని కూడా హిందీలో బాగా ఆదరించారు అంటూ కామెంట్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆమె మీద ఫైర్ అవుతున్నారు. నిజానికి ఆ సినిమాతోనే ఆమెకు స్టార్ డం వచ్చింది. అలాంటి సినిమాని మర్చిపోయి తమిళ సినిమా అని ఎలా అంటుంది అంటూ వాళ్ళంతా ఫైర్ అవుతున్నారు. నిజానికి డీజే సినిమా కూడా నార్త్ లో పెద్ద హిట్ అంటూ ఆమె కామెంట్ చేసింది. అంటే సౌత్ లో హిట్ కాలేదా అంటూ అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఆమె మర్చిపోయి మాట్లాడిందో లేక నిజంగానే అవగాహన లేక మాట్లాడిందో తెలియదు కానీ మొత్తానికి ఆమె అల్లు అర్జున్ అభిమానులకి టార్గెట్ గా మారింది అని చెప్పక తప్పదు.