భారతదేశం- న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ ఓడిపోయి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. కాగా.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. డ్వేన్ బ్రావో స్థానంలో 49 ఏళ్ల భారత మాజీ ఆల్ రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్‌కు బాధ్యతలు అప్పగించారు.
అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించినట్లయితే అతని పేరిట ఎన్నో రికార్డులు నమోదు అయ్యేవి. ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సాధించిన మొదటి స్పిన్నర్‌గా అక్షర్ నిలిచేవాడు. అంతేకాకుండా.. ఐసీసీ టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డులకెక్కే వాడు. ఇప్పటివరకు ఐసీసీ ఈవెంట్‌లలో ఏ భారత స్పిన్నర్ హ్యాట్రిక్ సాధించలేదు.
IND vs ENG: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టు ఇప్పటికే 4-1తో గెలుచుకుంది. ఈ నెల చివర్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్లు తమ వన్డే ప్రతిభను పరీక్షించుకోవడానికి ఇది ఒక అవకాశం అవుతుంది. టీ20ల కోసం ఇంగ్లాండ్ తమ జట్టులో అనేక మార్పులు…
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ కు సిద్ధమవుతుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాలో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకుంది. టీ20 సిరీస్‌లో అద్భుతంగా ప్రదర్శించిన 'మిస్టరీ స్పిన్నర్' వరుణ్ చక్రవర్తి.. భారత వన్డే జట్టులో చేరాడు.
Noman Ali: ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. జనవరి 25 శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 38 ఏళ్ల నోమన్ అలీ తన స్పిన్ బౌలింగ్‌తో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌పై ప్రతాపం చూపించాడు. మ్యాచ్‌లో తొలిరోజే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి పాక్ స్పిన్నర్ గా రికార్డ్ సృష్టించాడు. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే నోమన్ దెబ్బకు…
నిన్న జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో ఓడించి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ పై క్రికెట్ ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. అంతేకాకుండా.. ఇంగ్లండ్ ఆఫ్ఘాన్ పై ఓడటంతో చెత్త రికార్డును మూటగట్టుకుంది.