మాజీ ఐఎఎస్ అధికారి ప్రవీణ్‌ప్రకాష్ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారా? లేక ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారా? ఈ రెండూ కాకుండా.. తన ఐఎఎస్ తెలివి తేటలతో కొత్త అధ్యాయానికి తెరలేపబోతున్నారా? సర్వీస్‌లో ఉన్నప్పుడు తప్పులు చేశానంటూ.. ఇప్పుడు తాపీగా విచారం ప్రకటించడం వెనకున్న వ్యూహం ఏంటి? వీఆర్‌ఎస్ తీసుకున్నాక ఆయన వైఖరి ఎందుకు మారిపోయింది?
Also Read:Al-Falah University: ఢిల్లీ ఉగ్రదాడి.. అల్ ఫలాహ్ యూనివర్సిటీ సభ్యత్వం రద్దు..
సర్వీస్‌లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, నడిపిన వ్యవహారాలకు సంబంధించి అధికారులు, అందునా ఐఎఎస్‌లు విచారం ప్రకటించడం అత్యంత అరుదు. అందులోనూ.. సర్వీస్ మేటర్స్, పొలిటికల్ డెసిషన్స్ మీద కామెంట్స్ చేయడం వెరీ రేర్. అలాగే క్షమాపణలు కోరడమైతే.. బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అందుకే ఇప్పుడు ఏపీ కేడర్ మాజీ ఐఎఎస్ ప్రవీణ్‌ప్రకాష్‌వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఈ ఉన్నతాధికారి జగన్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. అప్పట్లో ప్రభుత్వంలో అంతా నేనే అన్నట్టుగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. కానీ.. సడన్‌గా ఇప్పుడు ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది.
గతంలో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నానంటూ పశ్చాత్తాపం ప్రకటించి సారీలు చెప్పడంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. వెయ్యి ఎలుకల్ని తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీ యాత్ర మొదలుపెట్టిందన్న సామెతను గుర్తు చేసుకుంటూ…. ప్రవీణ్‌ప్రకాష్ వ్యూహం ఏమై ఉంటుందా అని తెగ ఆరాలు తీసేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. అసలాయన కెరీర్ మొత్తం ఒక ఎత్తైతే వైసీపీ హయాంలోని ఐదేళ్లు మరో ఎత్తని ఐఏఎస్ వర్గాలే మాట్లాడుకుంటాయి. అప్పట్లో సీఎంవో కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శిగా బహుముఖ పాత్ర పోషించారు ప్రవీణ్ ప్రకాష్. విద్యాశాఖలో తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నారు.
ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక వీఆర్ ఎస్‌కు దరఖాస్తు చేయడం, ఆమోదం కూడా చకచకా జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈ మాజీ ఐఎఎస్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో చుట్టూ కొత్త చర్చ మొదలైంది. గత ప్రభుత్వంలో సీనియర్ ఐపీఎస్…ఏబీ వెంకటేశ్వరరావు, ఐఆర్‌ఎస్ ఆఫీసర్ కృష్ణ కిషోర్ విషయంలో తాను సరిగా వ్యవహరించలేదని, అప్పుడు అలా చేసి ఉండకూడదంటూ పశ్చాత్తాపం ప్రకటించారాయన. కానీ…ఏబీపై చర్యల విషయమై తప్పనిసరి పరిస్థితుల్లో అలా వ్యవహరించాల్సి వచ్చిందని, అనేక రకాలుగా ఆలోచించినాగానీ… తన చేతిలో ఏమీ లేకుండా పోయిందన్నారు ప్రవీణ్‌ప్రకాష్. ఈ ఇద్దరు అధికారుల మీద వైసీపీ హయాంలో చర్యలు తీసుకోవడం, తర్వాత వాళ్ళు క్యాట్ కి వెళ్లడం, అట్నుంచి కోర్ట్‌కు అలా చాలా వ్యవహారాలు జరిగాయి.
ఏబీ వెంకటేశ్వరరావు విషయంలోనైతే… కోర్ట్ ఆదేశాలను కూడా సరిగా అమలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. వాటన్నిటిపై ఇప్పుడు తీరిగ్గా పశ్చాత్తాపం ప్రకటించి సారీ చెప్పారు మాజీ ఐఎఎస్. అయితే ఆయనలో సడన్‌గా ఇంత మార్పును ఊహించలేదని, దీని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ కూడా వేరే ఏదో ఉండి ఉంటుందన్న డౌటనుమానంతో… వెదుకుతున్న వాళ్ళకు కొత్త సంగతులు తెలుస్తున్నాయట. వీఆర్‌ఎస్ తీసుకున్నాక ఏం చేయాలా అని ఆలోచిస్తున్న క్రమంలో….ప్రవీణ్ మనసు పాలిటిక్స్ వైపు మళ్ళిందని అంటున్నారు. వీలైనంత త్వరగా కాషాయ కండువా కప్పేసుకోవాలని ఆయన మనసు తహతహలాడిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ విషయంలో తనకంటే ముందున్న సీనియర్స్‌ని ఆదర్శంగా తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రవీణ్ ప్రకాష్ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. పైగా… సుదీర్ఘ కాలం ఢిల్లీలో పని చేసిన అనుభవం ఉండటంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారితో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. వాళ్ళ ద్వారా బీజేపీలో చేరడానికి దాదాపుగా డిసైడయ్యారని తెలుస్తోంది. అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే క్రమంలోనే… తాజా వీడియో కూడా విడుదల చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు పరిశీలకులు. ఈసారి జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక బరిలోకి దిగాలనుకుంటున్నట్టు సమాచారం. పైగా…కోట్లాది మంది హిందువులు కొంగు బంగారంగా కొలిచే విశ్వనాథుడు కొలువైన వారణాసిని కార్యక్షేత్రంగా ఎంచుకోబోతున్నారట. ప్రధాని మోడీ కూడా ఇక్కడి నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వినడానికి అంతా బాగానే ఉందిగానీ…. ప్రవీణ్ ప్రకాశ్ అక్కడెక్కడో వారణాసిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే… ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ అధికారులకు సారీలు చెప్పడం, విచారం వ్యక్తం చేయడాలు ఎందుకన్న డౌట్ వస్తోందా…? ఎస్… మీ అనుమానం కరెక్టే. కానీ… అసలు కిటుకు అక్కడే ఉందట. ఎంతైనా ఐఎఎస్ బుర్ర కదా…! అందుకే ప్రవీణ్‌ప్రకాష్ ఒకవైపు నుంచి పద్ధతిగా నరుకొస్తున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. కాశీ ఓటింగ్‌లో తెలుగువారి ప్రభావం తీసేయాల్సిందేమీ కాదు. అక్కడి పలు సంఘాల నేతలతో ప్రవీణ్‌కు ఇప్పటికే మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ప్రధాని మోదీ తన మానస పుత్రికగా చెప్పుకున్న స్వచ్ఛభారత్ మిషన్ కోసం వారణాశిలోనే పనిచేశారు ప్రవీణ్‌ప్రకాశ్.
Also Read:BSNL VoWi Fi: మహిళలు, విద్యార్థుల కోసం రూపొందించిన.. VoWi-Fi సేవను త్వరలో ప్రారంభించనున్న BSNL
వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కుదిరితే వారణాశి, లేదంటే ఆ చుట్టుపక్కల ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుకున్న అంశాలన్నిటికీ మించిన లెక్క మరోటి కూడా ఉందట. వైసీపీ హయాంలో చేసిన వ్యవహారాలకు సంబంధించి టీడీపీ పెద్దలు ప్రవీణ్ విషయంలో గుర్రుగా ఉన్నారు. రేపు అడుగు ముందుకు పడి తాను బీజేపీలో చేరాలనుకుంటే… కేంద్రంలో ఉన్న పలుకుబడితో వాళ్ళు అడ్డుపడకుండా… ఈ రూపంలో ముందునుంచే తెల్లజెండా చూపిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఈ సారీ….గమలన్నీ అందులో భాగమే అయి ఉండవచ్చని, ఫైనల్‌గా పొలిటికల్ సాంగ్ ఎలా సింగుతారో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.