కాకినాడలోని వలసపాక కేంద్రీయ విద్యాలయంలో అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి పడిపోతున్నారు విద్యార్దులు..దీంతో పిల్లలని ఇంటికి తీసుకుని వెళ్లిపోతున్నారు తల్లిదండ్రులు.. నిన్న రాత్రి కేక్ తినడం వల్లే అస్వస్థత అంటున్నారు చిన్నారులు….అస్వస్థతకు గురైనవారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 5, 6 తరగతి గదుల్లో ఊపిరాడక 30 మంది స్కూల్ పిల్లలు కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గల కారణాలను టీచర్స్, విద్యార్ధులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపు తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Read Also: Cyrus Mistry : ఏటా పెరుగుతున్న యాక్సిడెంట్లు..జాగ్రత్తలు లేకుండా ప్రయాణిస్తున్న ప్రముఖులు
విద్యార్థులు, తల్లిదండ్రుల రోదనలతో స్థానికంగా హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా వుంటే.. కాకినాడ జిల్లా వలసపాక కేంద్రీయ విద్యాలయ ఘటనపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ..జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు మంత్రి..విద్యార్థులు అందరూ కోలుకున్నారని తెలిపారు జిల్లా అధికారులు..అప్రమత్తంగా ఉండాలని, ఉన్నతాధికారులు వెళ్ళి పరిస్థితిని మరోసారి సమీక్షించాలని ఆదేశించారు బొత్స సత్యనారాయణ.
వలసపాకల కేంద్రీయ విద్యాలయం లో జెస్సికా( 4 వ తరగతి ) బాలాజీ( 6 వ తరగతి విద్యార్థి) స్కూల్ లో పుట్టిన రోజు సందర్భంగా ఛాక్లెట్లు పంచి పెట్టారు. ఆ చాక్లెట్లు ను పరీక్షించాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ని ఆదేశించారు డీ ఎం హెచ్ ఓ. కేంద్రీయ విద్యాలయలో ఒక్కసారి గా వాసన వచ్చిందని కాకినాడ లో చికిత్స పొందుతున్న కేంద్రీయ విద్యాలయం విద్యార్థినులు చెప్తున్నారు. ఊపిరి ఆడలేదని,గాలి పీల్చుకోవడం ఇబ్బంది అయిందని అంటున్నారు. రెండు క్లాస్ లలో ఈ వాసన వచ్చిందనిఒక్క సారి గా ప్యానిక్ అయ్యామని అంటున్నారు. స్కూల్ లో ఏమి తినలేదు, తాగలేదనిప్రస్తుతం బాగానే ఉంది, ఆ క్షణం లో భయం వేసిందని విద్యార్ధులు చెబుతున్నారు.. జీ జీ హెచ్ లో విద్యార్థినులను పరామర్శించిన ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే కన్న బాబు,కలెక్టర్ మాట్లాడారు. అక్కడ ఎటువంటి పొల్యూషన్ జరగలేదు. ఘటన పై విచారణ కి కమిటీ ని నియమించాము. 24 గంటల లోపు నివేదిక ఇస్తారు.. పిల్లలు దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాం అన్నారు.
Read Also: Assembly Adjourned to Monday: సభ సంతాపం.. అనంతరం తెలంగాణ అసెంబ్లీ 12కు వాయిదా