వైష్ణవి చైతన్య.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది.యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత సినిమా అవకాశాలను అందుకుంది..పలు సినిమాల లో సిస్టర్ పాత్రలలో నటించి మెప్పించింది.బేబీ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక బేబీ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.సాయి రాజేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమా గా విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. ఈ సినిమా లో వైష్ణవి పెర్ఫార్మన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలాగే హీరోలు గా నటించిన ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ఎంతో అద్భుతంగా నటించారు.బేబీ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ భామ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీ లో తెగ వినిపిస్తుంది.
ఈ భామ కు తెలుగు లో వరుస అవకాశాలు వస్తున్నాయి.అయితే తనకు ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చిన కానీ తాను ఎక్కడి నుంచి వచ్చాను అనేది మర్చిపోను అంటూ తాజాగా ఈమె షేర్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. తాను మొదట పని చేసిన ఇన్ఫినిటం సంస్థ కొత్త బ్యానర్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈమె అభినందనలు తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేసింది.నా జీవితం లో ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి అందులో ఒకటి ఇన్ఫినిటం. నా జర్నీ ఆ సంస్థ లోనే మొదలైంది.. అక్కడ నేను పనిచేసేటప్పుడు అందరూ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించే వారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేసింది.నేను ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎప్పటికీ తన మూలాల ను మర్చిపోలేనని, నా ఈ ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎప్పటికీ మరచిపోనని ఆమె తెలియజేశారు..అలాగే బేబీ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ధన్యవాదాలు తెలియజేసింది.