తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది మేము అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు. ఇవాళ గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీలతో పాటు వి.హనుమంతరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. బీజేపీ నిజాంకి వ్యతిరేకమని ఆరోపించారు. అంతేకాకుండా.. ఇప్పుడు గోల్కొండలో జెండా ఎగరేస్తారు అంటా అని, చార్మినార్.. గోల్కొండకి వ్యతిరేకం అంటారని, ఇప్పుడేమో జెండా గోల్కొండ కోటలో ఎగరేస్తాం అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read : British Airways: బ్రిటీస్ ఎయిర్వేస్లో ఐటీ ఫెయిల్యూర్.. పదుల సంఖ్యలో నిలిచిన విమానాలు..
అదేం పద్ధతిని ఆయన విమర్శలు గుప్పించారు. మదీనా సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం పెడతామని, అసద్ జైభీం అంటాడు.. కాబట్టి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు మద్దతి ఇవ్వాలన్నారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీజేపీపై ఉన్న వ్యతిరేకత కర్నాటక లో స్పష్టం అయ్యిందన్నారు. బీఆర్ఎస్ కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి గుణపాఠం చెప్తారని ఆయన వ్యాఖ్యానించారు. 20 రోజులో కేసీఆర్ ప్రజలను ఎలా మోసం చేశారు అనేది చెప్తామని ఆయన అన్నారు.
Kethireddy Peddareddy: జేసీ కుటుంబానికి పెద్దారెడ్డి సవాల్.. అది నిరూపించగలరా?