హైదరాబాద్ గోల్నాకలో కాంగ్రెస్ పార్టీ అంబర్ పేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు, అంబర్ పేట్ కాంగ్రెస్ నియోజకవర్గ అభ్యర్థి రోహిన్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి. హనుమంత్ రావు మాట్లాడుతూ.. మర్రి చెన్నారెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నపుడు ఇక్కడ ప్లే గ్రూండ్ లేదని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే 28 ఎకరాల గ్రౌండ్ ఇచ్చారు.. అదే గ్రౌండ్ లో ఇప్పుడు హైదరాబాద్ లోనే పెద్దదైన రావణ దహనం జరుగుతది.. బతుకమ్మ కుంట కబ్జా కాకుండా పోరాటం చూసాం అని ఆయన తెలిపారు.
లక్ష్మణ్ యాదవ్ కి ఇక్కడ టికెట్ కోసం ప్రయత్నం చేశామని కాంగ్రెస్ సీనియర్ వి.హనుమంతరావు అన్నారు. అనివార్య కారణాల వల్ల కుదర్లేదు అన్నారు, రోహిన్ రెడ్డి కి టికెట్ ఇచ్చారు.. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి లక్ష్మణ్ యాదవ్ కి న్యాయం చేస్తా అని మాట ఇవ్వాలి.. ఇప్పటి నుంచి లక్ష్మణ్ యాదవ్ ఎంతో రోహిన్ రెడ్డి అంత అందరం కలిసి రోహిన్ రెడ్డిని గెలిపించాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడున్న ముస్లింలని కూడా మేం అధికారంలోకి రాగానే ఆదుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. వాళ్ళకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పిస్తాం.. రోహిన్ రెడ్డి, అంబర్ పేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. కిషన్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీ ఐనా అస్సలు పట్టించుకోలేదు.. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇక్కడ చేసిన అభివృద్ధి లేదు.. చే నెంబర్ చొరస్తాలో బ్రిడ్జి రెండు ఏళ్ళుగా పూర్తి కాలేదు అని వి. హనుమంతరావు విమర్శించారు.