Congress Meeting: తెలంగాణ కాంగ్రెస్‌లో నేడు ( అక్టోబర్ 7న) కీలక పరిణామాలు చోటు చేసుకోనుంది. ముఖ్యంగా, బీసీ నేతల అత్యవసర సమావేశం ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు జరగనుంది. రేపు ( అక్టోబర్ 8న) హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ మత స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన 84వ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం, మన ఐడియాలజీ మనమే కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ రాజ్యాంగమని.. అందుకే బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు మన రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఇది తన బాధ్యత అన్నారు.
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్‌లో…
AICC Meeting Today in Delhi: నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ఆరంభం కానుంది. తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులు ఎవరు, ఏఐసీసీ ప్రక్షాళన, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి, వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా దక్కించుకోవాలి.. ఇవే అంశాలు ప్రధాన ఎజెండాగా నేడు కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది.…
CM Revanth Vs Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లాలో హరీష్ రావు మాట్లాడుతూ..
జాతీయ మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద విడుదల చేయడం సంతోషమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ను ఓడించిన ఉత్సాహంతోనే బీజేపీని ఓడించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రేవంత్ తెలిపారు.
షన్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీ ఐనా అస్సలు పట్టించుకోలేదు.. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇక్కడ చేసిన అభివృద్ధి లేదు.. చే నెంబర్ చొరస్తాలో బ్రిడ్జి రెండు ఏళ్ళుగా పూర్తి కాలేదు అని వి. హనుమంతరావు విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రములో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేయడానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జునా ఖర్గే 26వ తారీఖున వస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చినా.. ఏ ఒక్క పథకానికి కూడా కట్టుబడి లేదు అని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాక్రే అన్నారు.
Congress: కాంగ్రెస్ పార్టీ నేడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటు కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం జరుగబోతోంది.
ఇంద్రవెల్లి సభను కాంగ్రెస్ పార్టీ.. రేవంత్‌రెడ్డి సవాల్‌గా తీసుకున్నారు. వేదికపై పార్టీ నేతలు భారీగానే కనిపించినా.. కొందరు సీనియర్లు మాత్రం డుమ్మా కొట్టారు. దీంతో పార్టీలో చర్చ వారిపై మళ్లింది. రేవంత్‌తో కలిసి వేదిక పంచుకోలేక సభకు రాలేదేమో అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ సభకు రానిది ఎవరు? జానారెడ్డి ఇంద్రవెల్లికి ఎందుకు రాలేదు?ఆహ్వానం లేదని ఉత్తమ్ అలిగారా? తెలంగాణ కాంగ్రెస్‌లో తగువులు.. అలకలు సహజమని అనుకుంటారు కానీ.. అవే పార్టీని కొంపముంచే అంశంగా కొందరు చెబుతారు.…