Hen laid 31Eggs in 12Hours: ఏ జాతికి చెందిన కోడైనా సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు… అంతకుమించి గుడ్లు పెట్టడం జరగదు. కానీ ఉత్తరాఖండ్ లో ఓ కోడి 12 గంటల్లోనే ఏకంగా 31 గుడ్లు పెట్టింది. ఆల్మోరా జిల్లా బాసోత్ గ్రామానికి చెందిన గిరీశ్ చంద్ర బుధాని వద్ద ఒక కోడి ఉంది. ఈ కోడి రోజుకు రెండు గుడ్ల చొప్పున పెట్టేది. కానీ ఈ నెల 25న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటలవరకు 31 గుడ్లు పెట్టిందని గిరీశ్ తెలిపాడు. వివరాలు తెలుసుకునేందుకు గిరీశ్ ఇంటికి వచ్చిన పశుసంవర్థకశాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో కోడిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గిరీశ్ ఇంటికి వస్తున్నారు.
Read Also : Good News : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏడాది పాటు పెయిడ్ లీవ్స్
12 గంటల వ్యవధిలో ఏకంగా 31 గుడ్లు పెట్టి రికార్డు సృష్టించిన ఈ కోడి గురించి పూర్తి వివరాలు.. అల్మోరా జిల్లా.. బాసోత్ గ్రామంలో నివాసం ఉటున్న గిరీశ్ చంద్ర బుధాని.. టూర్ అండ్ ట్రావెల్స్ సంస్థలో పని చేస్తున్నాడు. అతడి దగ్గర ఓ కోడి ఉంది. ఇటీవల రోజుకు రెండు గుడ్లు పెట్టసాగింది. కానీ ఉన్నట్లుండి డిసెంబర్ 25న కోడి వరుసగా గుడ్లు పెడుతూనే ఉంది. సాయంత్రం.. ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్న గిరీశ్ ఆశ్చర్యపోయాడు. అతడు వచ్చాక కూడా కోడి గుడ్లు పెడుతూనే ఉంది. అలా రాత్రి 10 గంటల వరకు ఏకంగా 31 గుడ్లు పెట్టింది. ఈ సందర్భంగా గిరీశ్ మాట్లాడుతూ.. ఈ కోడికి రోజూ 200గ్రాముల వేరు శనగ గింజలు మేతగా వేస్తాం. అలానే వెల్లుల్లీని కూడా పెడతాను. రోజు ఒక్క గుడ్డు పెట్టేది. కానీ కొన్ని రోజులగా 2 గుడ్లు పెడుతుంది. కానీ డిసెంబర్ 25న మాత్రం ఏకంగా 31 గుడ్లు పెట్టింది. ఎందుకు ఇలా జరిగిందో తెలియదు అన్నాడు.