రెండు మూడు రోజుల్లో సీతారామ ప్రాజెక్టుల సందర్శనకు మంత్రులందరం వెళతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాము ఏదో చేస్తున్నామని భ్రమలు కల్పించారు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అని ఆయన మండిపడ్డారు. 1500 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టులు 2981 కోట్లకు అంచనా వ్యయం పెంచారన్నారు. ఇరిగేషన్ మంత్రిగా నేనే నిర్ఘాంత పోయా.. ఇరిగేషన్ శాఖను ద్వంసం చేశారని, 94 వేల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరంలో లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేదన్నారు. పదేళ్ల బీఆర్ ఎస్ ప్రభుత్వంలో నీటి వాటాలో ఒక చుక్క ఎక్కువ తీసుకువచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టులకు 60 శాతం నిధులు కేంద్రం ఇస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన ఫార్మేట్ లో అప్లై చేయలేదని, జాతీయ హోదా అనే అంశం రాజకీయాల కోసం బీఆర్ఎస్ నేతలు మాట్లాడారని, జాతీయ హోదా అనేది దేశంలో ఎక్కడా లేదని కేంద్ర జలశక్తి మంత్రి తేల్చి చెప్పారన్నారు. జాతీయ హోదా కాకుండా ఇతర మార్గాల్లో 60 శాతం నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, ఇప్పుడు జాతీయ హోదా గురించి మాట్లాడటానికి హరీష్‌కు సిగ్గూ శరం ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
కేఆర్‌ఎంబీకి ఏ ప్రాజెక్టు అప్పగించడానికి మేము ఒప్పుకోలేదని ఆయన మండిపడ్డారు. రాజకీయం చేయను అనుకుంటూనే హరీశ్ రాజకీయాలు మాట్లాడాడని, కేఆర్ఎంబీకి రాష్ట్రంలోని ప్రాజెక్టులు అందివ్వలేదన్నారు. కృష్ణా నది పై ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం చర్చలు జరిపింది. దీనిపై తెలంగాణ ఎలాంటి సమాధానం చెప్పలేదని, మేము కేంద్రం చెప్పిందనికి అంగీకారాన్ని తెలుపలేదన్నారు. కృష్ణ వాటర్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మీరు జగన్మోహన్ అలై బలై తీసుకున్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా జగన్ కృష్ణా నీటిని తీసుకు వెళ్తున్న ఒక్కసారి కూడా మాట్లాడలేదు. హైదరాబాద్ లో గంటలు గంటలు జగన్మోహన్ రెడ్డితో మీరు ఏకాంత చర్చలు జరిపారు. తెలంగాణ సంపద 2 లక్షల కోట్లు సంపద దోపిడీకి, అన్యాయానికి గురైంది. కేసీఆర్ 10.5, 11 %కు కార్పొరేషన్ లోన్లు తీసుకు వచ్చారు. బీఆర్ ఎస్ తీసుకు వచ్చిన అప్పులకు రిపేమాంట్ ఇంట్రెస్ట్ 18 వేల కోట్లు అవుతుంది.’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.