Uses of Black Turmeric: పసుపు జాతులలో, అంతరించిపోతున్న జాతి నల్లపసుపు . ఇది అధిక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ, నేపాల్ లోను లభిస్తుంది.. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది. పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. కాళీమాత పూజలో వాడే ఈ రకం పసుపుని హిందీలో కాలీ హాల్దీ అని పిలుస్తారు. కాలీ అంటే నలుపు ఆని అర్ధం. అందుకే ఈ రకం పసుపుకి నల్లపసుపు అని పేరు వచ్చింది. నల్ల పసుపు తాంత్రిక, వశీకరణ చర్యల కోసం ఉపయోగించే అరుదుగా దొరికే ఒక విధమైన పసుపు. ముఖ్యంగా నల్లపసుపు దుంపను తాంత్రిక విద్యల్లో వాడతారు. వశీకరణ చర్యలకు ఛత్తీస్ గడ్ కేశ్కల్ కొండ ప్రాంతాల్లో తాంత్రికులు నల్ల పసుపును ఆవు మూత్రంతో పేస్టులా చేసి దానిని నుదుటికి కుంకుమ వలె పెట్టుకుంటారు. నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు.
Also Read: Vivek Agnihotri: చిత్రపరిశ్రమ నా సినిమాను బ్యాన్ చేసిందనుకుంటా.. డైరెక్టర్ సంచనలన వ్యాఖ్యలు
ఈ మొక్క దుంపలను సౌందర్య వస్తువులు (కాస్మెటిక్స్) తయారీలో ఉపయోగిస్తారు. నల్ల పసుపు రుచికి చేదుగా ఉంటుంది. దీనిని పైల్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. గిరిజన స్త్రీలు రుతు క్రమ రుగ్మతలకు సంబంధించి దీనిని వినియోగిస్తారు. గిరిజన ప్రజలుజ్వరం, వాంతులు, విరేచనాలు, కణితులు మరియుద్వితీయ లైంగిక వ్యాధులు, మంట మొదలైనవాటి చికిత్సకు దీనిని ఉపయోగిస్తారు.న్యుమోనియా, దగ్గు మరియు పిల్లలలో జలుబు చికిత్సల కోసం కూడా ఉపయోగిస్తారు. నల్ల పసుపు బెండు తాజాపేస్ట్‌నుతేలు మరియు పాముకాటుకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో ఉండే కొన్ని కారకాలు ల్యూకోడెర్మా, మూర్ఛ,క్యాన్సర్ మరియు హెచ్‌ఐవికి వ్యతిరేకంగా పని చేస్తాయి. దీనిని ఉపయోగించడం ద్వారా మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అస్సాం రాష్ట్రంలో దీనిని ఆవాల నూనెతో కలిపి పశువుల విరేచనాలకు విరుగుడుగా వాడతారు. నల్ల పసుపు పేస్టును తేనె లేదా పాలతో కలిపి తీసుకుంటే జీర్ణకోశ, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.