ఈ మధ్య కాలంలో నల్ల పసుపు గురించి ఎక్కువగా వింటున్నాము.. నల్ల పసుపు మొక్కలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్ వంటి మందుల తయారీతో పాటు ఇతర మందులలో కూడా నల్ల పసుపును వినియోగిస్తుండటంతో దేశ, విదేశాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇది ఔషధాల కోసం మరియు సౌందర్య సాధనాల తయారీ కోసం విస్తృతంగా సాగు చేయబడుతుంది. అందుకే వీటికి పారిన్ లో మంచి డిమాండ్ ఉంటుంది.. మరి ఈ పంట గురించి వివరంగా తెలుసుకుందాం..…
Uses of Black Turmeric: పసుపు జాతులలో, అంతరించిపోతున్న జాతి నల్లపసుపు . ఇది అధిక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ, నేపాల్ లోను లభిస్తుంది.. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది. పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. కాళీమాత పూజలో వాడే ఈ రకం పసుపుని హిందీలో కాలీ హాల్దీ అని…