నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‍స్టాపబుల్ టాక్ షో లో పాన్ ఇండియా ఎపిసోడ్ రిలీజ్ కాబోతుంది. అన్‍స్టాపబుల్‍కు తొలిసారి ఓ బాలీవుడ్ హీరో వస్తున్నారు.యానిమల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అన్‍స్టాపబుల్ షోలో గెస్టులుగా రానున్నారు. అన్‍స్టాపబుల్ 3లో ఈ పాన్ ఇండియా ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా ఓటీటీ నేడు అధికారికంగా ప్రకటించింది.రణ్‍బీర్ కపూర్, రష్మిక, సందీప్ పాల్గొన్న అన్‍స్టాపబుల్ ఎపిసోడ్ నవంబర్ 24వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు అధికారికంగా ప్రకటించింది. “డేట్ గుర్తుపెట్టుకోండి.. నవంబర్ 24. ఈ సీజన్‍లో వైల్డెస్ట్ ఎపిసోడ్ మీ స్క్రీన్‍లపైకి రానుంది” అని ట్వీట్ చేసింది. ఓ చిన్న వీడియోను కూడా ఆహా టీం పోస్ట్ చేసింది.
ఈ ఎపిసోడ్‍లో హోస్ట్ బాలకృష్ణ డైలాగ్‍ను రణ్‍బీర్ చెప్పినట్టు సమాచారం. “ప్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు” అంటూ లెజెండ్ చిత్రంలోని డైలాగ్‍ను రణ్‍బీర్‌తో బాలయ్య చెప్పించారట. అలాగే, బాలయ్య, రణ్‍బీర్, రష్మిక కలిసి ఓ పాట స్టెప్పులేసినట్టు తెలుస్తుంది.. మొత్తంగా ఈ ఎపిసోడ్‍లో అదిరిపోయే ఫన్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. దీంతో తెలుగు ప్రమోషన్లను కూడా గట్టిగా చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది.అన్‍స్టాపబుల్ లాంటి పాపులర్ టాక్ షోతోనే యానిమల్ తెలుగు ప్రమోషన్లను మొదలు పెట్టారు మేకర్స్…ఇదిలా ఉంటే యానిమల్ టీమ్‍తో అన్‍స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ రెండు రోజుల క్రితమే పూర్తయింది. ఈ కార్యక్రమం కోసం రణ్‍బీర్, రష్మిక, సందీప్ హైదరాబాద్ కు వచ్చి షూటింగ్‍లో పాల్గొన్నారు.